మల్లెమాల వారి జబర్దస్త్ కామెడీ రియాలిటీ షో తెలుగు టెలివిజన్ చరిత్రలో సుదీర్ఘ కాలం పాటు సక్సెస్ ఫుల్ గా రన్ అయిన షోగా నిలబడింది అని చెప్పాలి. ఇక ఈ షో ద్వారా ఎంతో మంది టాలెంటెడ్ నటులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. వారిలో చాలా మంది స్టార్స్ కూడా అయ్యారు. జబర్దస్త్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన ఎంతో మంది కళాకారులు ప్రస్తుతం ఆర్ధికంగా స్థిరపడటంతో ఈటీవీ మాత్రమే కాకుండా ఇతర చానల్స్ లో కూడా షోలు చేస్తూ రాణిస్తున్నారు.
అలా జబర్దస్త్ లోకి కమెడియన్ గా అడుగుపెట్టి టీం లీడర్ గా ఎదిగిన వ్యక్తి హైపర్ ఆది. అతి తక్కువ కాలంలో స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకొని తనకంటూ ఒక బ్రాండ్ ని హైపర్ ఆది క్రియేట్ చేసుకున్నాడు. జబర్దస్త్ షోకి మెయిన్ పిల్లర్ గా మారాడు. అయితే సడెన్ గా ఏమైందో జబర్దస్త్ కి విరామం ఇచ్చాడు. తరువాత ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో కనిపిస్తున్నాడు. అలాగే మల్లెమాల వారి అన్ని ఈవెంట్స్ లో కనిపిస్తున్న జబర్దస్త్ లోకి మాత్రం అడుగుపెట్టలేదు. దీంతో జబర్దస్త్ నుంచి హైపర్ ఆది బయటకి వచ్చాడని టాక్ నడిచింది.
అయితే మళ్ళీ సడెన్ గా నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ తో హైపర్ ఆది జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. దీనికి సంబంధించి తాజాగా ప్రోమోలో చూపించారు. అందులో డాన్స్ లతో ఆయనకి స్వాగతం చెబుతున్నట్లు చూపించారు. ఇక షోలోకి అడుగుపెట్టిన తర్వాత యధావిధిగా తనకి మాత్రమే సాధ్యమైన పంచ్ డైలాగ్స్ తో హైపర్ ఆది కొత్త కళని షోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసాడు. ఇప్పటికే గెటప్ శ్రీను కూడా జబర్దస్త్ లోకి రీఎంట్రీ ఇచ్చాడు. అలాగే ఇప్పుడు హైపర్ ఆది, ఇదే దారిలో సుడిగాలి సుధీర్ కూడా జాయిన్ అయిపోతే మళ్ళీ షోకి మునుపటి కళ వచ్చేస్తుందని అందరూ భావిస్తున్నారు.