Bigg Boss Season 6 Day 6 First Promo: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఫస్ట్ వీకెండ్ శనివారం ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో హోస్ట్ నాగార్జున తనదైన శైలిలో గీతు రాయల్, ఆదిరెడ్డి, రోహిత్ ఇంకా మెరీనా, రేవంత్ లకి కామెడీ తరహాలో కౌంటర్ లు వేసేశారు. తనని హౌస్ లో సరిగా చూసుకోవడం లేదని భర్త రోహిత్ పై మెరీనా గత ఎపిసోడ్ లో చేసిన వ్యాఖ్యలను నాగార్జున ప్రస్తావించి హౌస్ లో అందరి ముందు మెరీనాకి రోహిత్ గట్టిగా హగ్ ఇవ్వాలని కోరారు. ఆ తర్వాత గీతు రాయల్ హౌస్ మేట్స్ తన కుటుంబం కాదని.. శుక్రవారం ఎపిసోడ్ లో చేసిన వ్యాఖ్యలను నాగార్జున ప్రస్తావించి ఆమెకి గట్టిగా క్లాస్ పీకారు.
ఇంకా రేవంత్ తో .. సినిమా పాటలు మరియు సినిమా పేర్లు పోటీ కార్యక్రమంలో ఆరోహి ఓడిపోయింది. ఆ సందర్భాని ఉద్దేశించి….ఓడిపోయిన బాధలో వెనక్కి వచ్చిన ఆరోహి నీ.. వచ్చిన వెంటనే మాట అనటం అవసరమా అని రేవంత్ ని నాగార్జున ప్రశ్నించారు. గేమ్ ఓడిపోవడంతో క్షమించు అని సారీ చెప్పడానికి నీ దగ్గరకు వచ్చింది. నువ్వు వింటున్నావు మధ్యలో ఇద్దరు కామెంటేటర్ లు వచ్చారు.
వాళ్ల సంగతేంటి..? వాళ్లేమో.. బయట రివ్యూలు చేసి వచ్చి మధ్యలో దురటం అలవాటు.. అంటూ ఇన్ డైరెక్ట్ గా ఆదిరెడ్డి, గీతు రాయల్ పై నాగార్జున మండిపడినట్లు ప్రోమోలో చూపించారు. ఆ తర్వాత ఆదిరెడ్డిని లేపి.. గ్రౌండ్ లో ఆటాడుతున్నప్పుడు ఆటలో ఆటగాళ్లు ఉంటారా..? ఎంపైర్లు ఉంటారా..? అని ప్రశ్నించారు. దానికి ఆదిరెడ్డి ఆటగాళ్లు ఉంటారు అని జవాబు ఇచ్చాడు. మరి గ్రౌండ్ లో ఎంపైర్ ఉంటే ఎలా..? కష్టం కదా అంటూ ఆదిరెడ్డికి నాగార్జున ప్రోమో చివరిలో గట్టిగా కౌంటర్ ఇచ్చారు.