Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మొదటివారం హౌస్ నుండి ఎవరు ఎలిమెంట్ అవుతారో అనేది ఇప్పుడు ఉత్కంఠ భరితంగా మారింది. రేవంత్ , ఫైమా, సుల్తానా, ఆరోహి, అభినయశ్రీ, చంటి, శ్రీ సత్య ఈ ఏడుగురు నామినేషన్ లో ఉన్నారు. అయితే వీరిలో ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓటింగ్ పరంగా సుల్తానా, ఆరోహి, అభినయశ్రీ ఈ ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారంట. శనివారం జరిగే ఎపిసోడ్ లో రేవంత్, ఫైమా, చంటి, శ్రీ సత్య ఈ నలుగురు సేఫ్ అయినట్లు నాగార్జున ప్రకటించినట్లు లీక్ వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా ఓటింగ్ పరంగా కూడా మొదటినుండి ఈ నలుగురికి భారీగా ఓట్లు పడ్డాయి. పైగా రేవంత్, ఫైమా, చంటి, శ్రీ సత్య ఈ నలుగురికి బయట మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. దీంతో ఈ నలుగురు సేవ్ అయినట్లు తెలుస్తోంది. బుధవారం ఈ ఏడుగురు ఎలిమినేషన్ కి నామినేట్ అయిన నాటినుండి ఓటింగ్ పరంగా సుల్తానా, అభినయశ్రీ, ఆరోహీ చివరి మూడు స్థానంలోనే ఉంటూ వస్తున్నారు.

దీంతో శుక్రవారం అర్ధరాత్రి ఓటింగ్ పోల్స్ ముగిసే సమయానికి ఇంకా వీళ్ళ గ్రాఫ్ మారకపోవడంతో.. సీజన్ సిక్స్ మొదటివారం డేంజర్ జోన్ లో సుల్తానా, అభినయశ్రీ, ఆరోహీ వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే హౌస్ లో తొలి వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్.. ఎక్కువ అని బయట టాక్. గతంలో ఎన్నడూ లేని విధంగా 21 మంది సభ్యులను హౌస్ లోకి పంపించడంతో.. షో నిర్వాహకులు మొదటివారం హౌస్ నుండి ఇద్దరిని పంపించే ఛాన్స్ ఉందని ఆడియన్స్ భావిస్తున్నారు.