Papaya fruit: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిఒక్కరూ పోషకాహారపు అలవాట్లను అలవర్చుకోవాలి. పోషకాలు ఉన్న కూరగాయలు, పండ్లను తినడంతో పాటు వ్యాయామం చేడయం ఎంతో మంచి అలవాటు. ముఖ్యంగా బొప్పాయి పండు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆరోగ్యానికి బొప్పాయి ఎంతో మేలు కలిస్తుంది. అందులో చాలా రకాల విటమిన్లు ఉంటాయి. బొప్పయి పండులో ఉన్నంత విటమిన్లు మరెందులోనూ ఉండవని వైద్యులు చెబుతున్నారు.
బొప్పాయి పండులో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సితో పాటు విటమిన్ డి కూడా తగు మోతాదులో ఉన్నాయి. బొప్పాయి పండును తరచుగా ఆహారంగా తీసుకోవడం వలన మనిషి శరీరానికి కావాల్సిన విటమిన్లు ఎంతో పుష్కలంగా లభిస్తాయి. బొప్పాయిలో పపెయిన్ అనే పదార్థం ఉండటం చేత మనిషి శరీరంలో జీర్ణక్రియ ఎంతో సాఫీగా జరిగేందుకు ఉపయోగపడుతుంది. ఉదర సంబంధించిన రోగాలను మటుమాయం చేయడంలో బొప్పాయి పండు చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. పలు జబ్బులకు ప్రధానమైన కారణం శరీరంలోని ఉదరమే.

Papaya fruit: బొప్పాయి పండును గర్భిణీలు ఆహారంగా తీసుకోవచ్చా..?
ఉదరానికి సంబంధించిన వ్యాధులు తగ్గేందుకు తరచూ బొప్పాయి పండును ఆహారంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. బొప్పాయి పండును గుజ్జుగా చేసి పిల్లలకు 4వ నెల నుంచి తినిపిస్తే ఎంతో మంచిది. ఇక యుక్త వయస్సు వారు దోరగా ఉన్న బొప్పాయి పండును తినొచ్చు. బొప్పాయి పండులో కొవ్వుతో పాటు క్యాలరీలూ కూడా తక్కువే ఉంటాయి. అంతేకాదు కంటికి సంబంధించిన రోగాలు మనదరికి చేరకుండా బొప్పాయి పండులోని బిటాకెరోటిన్ ఎంతో ఉపయోగపడుతుంది.
కానీ బొప్పాయి పండును గర్భిణీ స్త్రీలు తినకూడదని చెబుతూ ఉంటారు. ఎందుకంటే గర్భస్రావం జరుగుతుందరి అందుకే తినకూడదు అంటారు. వాస్తవానికి బొప్పాయిలో మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. అందుకే విటమిన్ ఎ ఎక్కువగా తీసుకుంటే అబార్షన్ అయ్యే అవకాశాలున్నాయి. కానీ, గర్భస్రావం లేదా గర్భ విచ్చిత్తి జరగాలంటే విటమిన్ ఎ సుమారు ఐదు కిలోలు బొప్పాయి తినాలి. అంతమేర గర్భిణీలు తినలేరు. కావున ఎలాంటి సందేహాలు లేకుండా మిగతా పండ్ల మాదిరిగానే గర్భిణీలు కూడా బొప్పాయి పండును మితంగా తీసుకోవడం వల్ల ప్రమాదం ఏమీ లేదని పలువురు డాక్టర్లు సూచిస్తున్నారు.