Anupama Parameswaran: మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో అనుపమ సోషల్ మీడియా సెన్సేషన్‌గా మరితోంది. అఆ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన అనుపమ మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ ని క్రియేట్ చేసుకుంది.
ఆ తర్వాత తెలుగులో ప్రేమమ్,శతమానం భవతి,హలో గురు ప్రేమ కోసమే,రాక్షసుడు, ఉన్నది ఒకటే జిందగీ వంటి చిత్రాల్లో నటించింది మెప్పించింది. కానీ మధ్యలో కొన్ని ప్లాప్స్ పడడంతో ఈమెకి ఆఫర్లు చాలా వరకు తగ్గాయి. పోతే అనుపమ ఇటీవల కార్తికేయ 2 సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ను అందుకోవడం తోపాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోయిన విషయం తెలిసిందే. ఈ సినిమా హిట్ తో అనుపమ మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. ఇది ఇలా ఉంటే మొదట్లో గ్లామర్ షో కి దూరంగా ఉండే అనుపమ ఈ మధ్యకాలంలో సినిమాలలో రౌడీ బాయ్స్ ఇలాంటి సినిమాలు లిప్ లాక్ సన్నివేశాలలో కూడా నటించింది.
అంతేకాకుండా సినిమాల్లో మంచి అవకాశం వచ్చి గుర్తింపు వస్తుంది అంటే గ్లామర్ చేయడానికి అయిన రెడీ అంటోంది ఈ ముద్దుగుమ్మ. ఇలా ఉంటే తాజాగా అనుపమ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
అందులో నల్ల చీరలో మెరిసిపోయిన అనుపమ తో పాటు పక్కన హీరో నిఖిల్ కూడా ఉన్నాడు. బ్లాక్ కలర్ శారీలో హీరో నిఖిల్ తో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆ ఫోటోలలో అనుపమ స్టైలిష్ గా చీర కట్టుకొని కుర్చీలో కూర్చోగా నిఖిల్ పక్కన నిలబడి ఉన్నాడు.