Ananya Pande : ఇండస్ట్రీలో ప్రేమలో పడటం ఎంత కామనో.. బ్రేకప్ చెప్పుకోవడం కూడా అంతే కామన్ అన్న విషయం తెలిసిందే. అయితే కొందరు ప్రేమలో ఉండగానే విడిపోతే.. మరికొందరు డేటింగ్ చేసి అనంతరం విడిపోతారు. కొందరు పెళ్లయ్యాక విడిపోతే.. మరికొందరు పెళ్లై పిల్లలు కూడా పుట్టిన తర్వాత విడిపోతారు. బయట కూడా ఇది జరుగుతుంది కానీ ఇండస్ట్రీలో మాత్రం సర్వ సాధారణం. ఒక జంటకు పెళ్లైందంటే.. ఎంతకాలం కలిసి కాపురం చేస్తారనేది చెప్పడం చాలా కష్టం. క్యూట్ కపుల్, స్వీట్ కపుల్, ఇండస్ట్రీలోనే ది బెస్ట్ కపుల్ అన్న వారు సైతం తమ దాంపత్య జీవితానికి గుడ్ బై చెప్పేసి ఎవరి మానాన వారు బతికేస్తున్నారు. ఇది ఇండస్ట్రీ మాయాజాలం. అలాంటిది ప్రేమ జంట బ్రేకప్ చెప్పుకోవడం పెద్ద విశేషం ఏమీ కాదు.
తాజాగా లైగర్ బ్యూటీ.. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే- షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్ విడిపోయినట్లు బీటౌన్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఖాళీ పీలి సినిమా నుంచి అనన్య – ఇషాన్ ఖట్టర్‌ల డేటింగ్ జర్నీ ప్రారంభమైంది. ఇంతలోనే ముగిసినట్లు సమాచారం. డేటింగ్‌లో ఉన్న సమయంలో ఈ జంట పార్టీలకు, ఫంక్షన్‌లకు, ట్రిప్పులకు, టూర్లకు కలిసి వెళ్తూ తెగ హడావుడి చేసింది. దీంతో ఈ జంట ఎప్పటికీ విడిపోదని అభిమానులు భావించారు. కానీ ఈ జంట తాజాగా బ్రేకప్ చెప్పేసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఇదే విషయంపై ఇషాన్ క్లారిటీ ఇచ్చేశాడు.
Ananya Pande : జీవితాంతం ఆమెకు స్నేహితుడిగా ఉండాలని కోరుకుంటున్నా..
కాఫీ విత్ కరణ్ షోలో ద్వారా ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. వాటిలో ఈ బ్రేకప్ న్యూస్ కూడా ఒకటి. తాజాగా కత్రినా కైఫ్, సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి ఇషాన్ ఖట్టర్ ‘కాఫీ విత్ కరణ్’ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అనన్యతో నువ్వు విడిపోయావు కదా అని కరణ్ ప్రశ్నించగా ప్రస్తుతానికి తాను సింగిల్ అని పేర్కొన్నాడు. మరిప్పుడు అనన్యతో స్నేహంగా ఉంటున్నారా అని అడగ్గా నా జీవితాంతం ఆమెకు స్నేహితుడిగా ఉండాలని కోరుకుంటున్నా. నాకు తెలిసిన వాళ్లలో మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్ అనన్య అని చెప్పాడు. మరి అంత స్వీటెస్ట్ పర్సన్‌తో ఎందుకు విడిపోవాల్సి వచ్చిందనే విషయం మాత్రం తెలియరాలేదు.