Yashoda Teaser: సమంత ప్రధాన పాత్రలో డైరెక్టర్లు హరి -హరీష్ దర్శకులుగా శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం యశోద.లేడీ ఓరియంటెడ్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ టీజర్ చూస్తుంటే సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఎంతో ఉత్కంఠ భరితంగా కట్ చేసే విడుదల చేశారు.థ్రిల్లర్ జానర్ లో తెరికెక్కిన సినిమాలకు టీజర్ కట్ చేయడం అంటే సమానమైన విషయం కాదు అయితే డైరెక్టర్లు ఈ సినిమా టీజర్ ఎంతో అద్భుతంగా కట్ చేసి విడుదల చేశారు. ఇక ఈ టీజర్ చూస్తుంటే సమంత ఎన్నో బాధలను కష్టాలను ఎదుర్కొంటున్నట్టు ఉందని అర్థమవుతుంది.
ఇందులో ఈమెను గర్భవతిగా చూపెడుతూ తనకు ఒకవైపు జాగ్రత్తలు చెబుతూనే దాని వెనుక నెగిటివ్ యాంగిల్ లో ఒక్కోసిన్ కట్ చేస్తూ విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తే సమంత ఎన్నో బాధలు అనుభవిస్తుందని తెలుస్తోంది. అయితే ఆమెకు అంత కష్టం ఏంటి? ఆమె ఎందుకు అలా బాధపడుతుంది అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ టీజర్ సినిమాపై ఎన్నో సందేహాలను వ్యక్తపరచడమే కాకుండా ఆసక్తికరంగా ఉత్కంఠతకు గురి చేసింది.
Yashoda Teaser: అద్భుతమైన నటన కనపరిచిన సమంత..
ఇక ఈ సినిమాలో సమంత కూడా ఎంతో అద్భుతంగా నటించిందని అర్థమవుతుంది. ఈ సినిమాలో సమంత పాత్ర ఎంతో ఆసక్తికరంగా ఉండబోతుందని టీజర్ చూస్తూనే అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. అయితే విడుదల తేదీని కూడా త్వరలోనే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.ఇక ఈ సినిమాలో నటి వరలక్ష్మి శరత్ కుమార్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.