హిమ, సౌర్య పుట్టిన రోజు కావడంతో పిల్లల పేరు మీద పూజ చేయడానికి దీప గుడికి వెళుతుంది. అదే సమయంలో సౌర్య కూడా వారణాసితో కలిసి అర్చన చేయించడానికి అదే గుడికి వస్తుంది. కానీ.. దీప, సౌర్య పక్క నుంచే వెళతారు కానీ చూసుకోరు. ఇంతలో మోనిత సైతం కార్తీక్‌ని అదే గుడికి తీసుకొస్తుంది. దీపని ఎప్పుడు కలవనని దేవుడి మీద ప్రమాణం చేయమని కార్తీక్‌ని బలవంతం చేస్తుంది. ఇంతలో అక్కడికి వచ్చిన దీప తనేం తప్పు చేయలేదని దేవుడి మీద ప్రమాణం చేస్తుంది. అంతటితో ఆగకుండా.. మోనితని కూడా ప్రమాణం చేయమంటుంది. కార్తీక్‌కి కూడా దీప మాటల్లో లాజిక్ కనిపించడంతో అలాగే చేయమని మోనితకి చెబుతాడు. ఆ తర్వాత సెప్టెంబర్ 8 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
‘దీప చెప్పింది నిజమే కదా. నువ్వు చెప్పింది కూడా నిజమే అయితే నువ్వు కూడా ప్రమాణం చేయి’ అని మోనితతో కార్తీక్ అంటాడు. ‘నేను చేయను. నాకేం అవసరం’ అంటూ దాటవేసే ప్రయత్నం చేస్తుంది మోనిత. దాంతో.. తన ప్రవర్తన చూసైన, నిజానికి అబద్దానికి తేడా తెలుసుకోమని కార్తీక్‌కి చెబుతుంది దీప. దాంతో.. కుదరదంటూ కార్తీక్‌ని చేయి పట్టి లాక్కెళ్లిపోతుంది. బలవంతంగా కారులో ఎక్కిస్తుంది. ఇంకోవైపు.. సౌర్య, వారణాసి కూడా ఆటోలో అక్కడి నుంచి వెళ్లిపోతారు.
అనంతరం కారులో వెళుతున్న మోనిత.. ఇంతకుముందు సౌందర్య, ఆనందరావు.. తర్వాత దీప.. ఇప్పుడు సౌర్య.. అందరూ ఇక్కడే తిరుగుతున్నారు. ‘దీప, కార్తీక్ బతుకున్న విషయం అందరికీ తెలుసా. లేక తెలియకుండానే అందరూ ఇక్కడే తిరుగుతున్నారా. దీప ఒక్కతే ఇలా చేస్తుంటే.. అందరూ కలిస్తే నాకు చుక్కలు చూపిస్తారు’ అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో కార్తీక్ వేరే దారిలో కారుని తీసుకెళ్లడం చూసి ఇటుకాదు కదా అంటుంది. తను మర్చిపోతాను కదా అని కార్తీక్ చెబుతాడు. అనంతరం ‘దేవుడి మీద ప్రమాణం చేసింది కదా.. ఆమె నిజం నీ టిఫిన్‌లో విషం కలపలేదు. కానీ.. నువ్వే చేయలేదు. ఎందుకు’ అని మోనితని కార్తీక్ ప్రశ్నిస్తాడు. దాంతో కోపంతో ఊగిపోయిన మోనిత కారు ఆపిస్తుంది. ‘కిందకి దిగి ఇంకోసారి దీపని కలవను మాట్లాడనని మాట ఇవ్వు’ అని కోపంగా అంటుంది మోనిత. దాంతో కార్తీక్‌కి కోపం వచ్చి కారు వేసుకుని వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అది చూసి కంగారుగా మోనిత ఆటోలో అక్కడి నుంచి బయలుదేరుతుంది.
మరోవైపు.. గుడి నుంచి వెళ్లిన సౌర్య, వారణాసి ఓ చోట టిఫిన్ చేస్తుంటాడు. దాంతో.. ఇదేనా బర్త్ డే పార్టీ ఇదేనా అని అడుగుతాడు వారణాసి. దాంతో అమ్మనాన్న లేకుండా పార్టీ ఎలా చేసుకోమంటావు అని బాధగా అంటుంది సౌర్య. అనంతరం కార్తీక్ గురించి ఆలోచిస్తూ.. అమ్మనాన్న గురించి ఎన్ని రోజులు ఎదురు చూడాలని ఎమోషనల్ అవుతుంది సౌర్య. దాంతో.. కచ్చితంగా దొరుకుతారని వారణాసి, సౌర్యకి సర్ది చెబుతాడు.
అనంతరం గుడి నుంచి సరాసరి డాక్టర్ అన్నయ్య ఇంటికి వెళుతుంది దీప. గుడిలో జరిగిన విషయాలను పూస గుచ్చినట్లు చెబుతుంది దీప. దాంతో.. ఆయనకి అన్ని గుర్తొస్తుందని డాక్టర్, ఆయన తల్లి చెబుతారు. దాంతో.. ‘ఏమో అన్నయ్య.. అది మందులు వేసి గతం మర్చిపోయేలా చేస్తోంది.. మనం కూడా మందులు వేద్దామంటే నువ్వేమో వద్దంటున్నావు’ అని బాధగా అంటుంది దీప. అది విని.. ‘డాక్టర్ బాబు ఏం ప్రయోగశాల కాదు. అలా చేస్తే డాక్టర్ బాబు ఆరోగ్యానికే నష్టం వాటిల్లే అవకాశం ఉందమ్మా’ అని చెబుతాడు డాక్టర్. తర్వాత డాక్టర్ బాబుకి కోపం పోయింది కాబట్టి ఆయన దగ్గరకి నువ్వెల్లొచ్చు కదా అని పెద్దావిడ చెప్పడంతో అక్కడి వెళ్లిపోతుంది దీప.
ఇంకోవైపు.. కోపంగా కారులో ఇంటికి బయలుదేరిన కార్తీక్, మోనితని తిట్టుకుంటూ ఉంటుంది. అలా కొంచెం దూరం వెళ్లాక అడ్రెస్ మర్చిపోవడంతో ఎటువెళ్లాలో తెలియక కారు దిగి అటు ఇటు చూస్తుంటాడు కార్తీక్. ఇంతలో ఆటోలో ఇంటికి వస్తుంది మోనిత. అక్కడి పని వాళ్లు కార్తీక్ ఇంటికి వచ్చాడని చెప్పడంతో రిలాక్స్ అవుతుంది. అనంతరం ఇంట్లోకి వెళ్లి చూడగా.. కార్తీక్ తలకి మర్దన చేస్తుంటుంది దీప. అది చూసి మొదట షాకై చూసిన మోనిత.. పట్టరాని కోపంతో దీపని ఎందుకు తీసుకొచ్చావు అని అరుస్తుంది. దాంతో.. జరిగింది చెబుతా అని అసలు విషయాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తుంటాడు. మర్చిపోవడంతో దీపనే చెప్పమంటాడు. కానీ.. మీరే గుర్తు చేసుకొని చెప్పమని దీప ప్రొత్సాహించడంతో గుర్తు చేసుకునేందుకు ట్రై చేస్తుంటాడు కార్తీక్. దాంతో ఈ ఎపిసోడ్‌కి శుభంకార్డు పడుతుంది. తరువాయి భాగం అంటూ.. నా భర్తని జాగ్రత్తగా తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ చెబుతుంది మోనిత. అనంతరం దీపని కౌగిలించుకుని కార్తీక్ తన వాడంటుంది మోనిత. దాంతో కార్తీక్‌కే స్వయంగా తన్ని తరిమేసేలా చేస్తానని అదే స్థాయిలో అంటుంది దీప. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.