Infertility: మనిషి జీవనశైలిలో మార్పుల కారణంగా ప్రస్తుత కాలంలో అనేక మంది దంపతులు సంతానలేమి సమస్య కారణంగా బాధపడుతున్నారు. సంతానం కోసం ఏకంగా లక్షల్లో కష్టపడి సంపాదించిన డబ్బును ఖర్చు చేసి డాక్టర్ల చూట్టూ చక్కర్లు కొడుతున్నారు. అంతేకాదు మన దేశంలో సంతానం కోసం ఎందరో దేవుళ్లకి పూజలు చేసుకుని మొక్కులు చెల్లించుకుంటారు. సంతాన ప్రాప్తి కల్పించాలని కోరుతూ దేవాలయాలకు వెళ్లి దేవుళ్లను వేడుకుంటారు. కుల దేవుళ్లకు మొక్కులు చెల్లించుకుంటారు.
ప్రస్తుత కాలంలో సంతాన లోపంతో బాధపడే పురుషుల సంఖ్య గణనీయంగా పెరిగిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందుకు అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. మనం తీసుకునే ఆహారం మాత్రమే కాకుండా సంతాన లోపానికి జన్యువులు కూడా కారణం అంటున్నారు శాస్త్రవేత్తలు. పురుషుల సంతానోత్పత్తిని ప్రభావితం చేయడంతో ప్రత్యేకమైన 8 రకాల జన్యువులు పాత్ర పోషిస్తున్నాయని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ శాస్తవేత్తలు ఇటీవల గుర్తించడం జరిగింది.

Infertility: పురుషులే సంతానలేమికి కారణమని అధ్యయనంలో వెల్లడి.!
ఇందుకు సంబంధించిన వివరాలను సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయగ్నస్టిక్స్ డైరెక్టర్ డాక్టర్ కె. తంగరాజ్ వెల్లడించారు. సంతానం కలగకపోతే మహిళలపై నిందలు వేయడం సరికాదని అందుకు కారణం పురుషుల్లోని సమస్యలే అని వారు స్పష్టం చేశారు. మన దేశంలో పురుషుల్లో వంధ్యత్వ సమస్యకు గల కారణాలను కనుగునేందుకు డాక్టర్ తంగరాజ్ సారధ్యంలో శాస్త్రవేత్తలు రెండు దశాబ్ధాలుగా పరిశోధనలు చేస్తున్నారు. 38 శాంతం మంది వై క్రోమోజోమ్ లో తేడాలు ఉన్నట్లు గతంలో వంధ్యత్వ సమస్యలు గల పురుషుల్లో గుర్తించడం జరిగింది.
దీంతో పాటు వంధ్యత్వానికి కారణం కణాల్లోని మైటోకాండ్రియా, ఆటోసామల్ జన్యువుల్లో కలిగే మార్పులు అని తేల్చేశారు. 47 మంది వంధ్యత్వ సమస్య ఉన్న వారిలో జన్యుక్రమాన్ని పరిశోధనలో పరిశీలించామని తెలిపారు. దేశంలో మరో 1,500 మంది వంధ్యత్వ పురుషుల్లోని జన్యు మార్పులతో పోల్చి చూసిన క్రమంలో 8 ప్రత్యేక జన్యువలు విషయం గుర్తించామని ఈ పరిశోధనలో పాత్ర వహించిన సీసీఎంబి పీహెచ్డీ విద్యార్థి, ముంబై నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ రిప్రోడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ శాస్త్రవేత్త సుధాకర్ దిగుమర్తి పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన విషయాలు హ్యూమన్ మాలిక్యులర్ జెనెటిక్స్ అనే జర్నల్ లో ప్రచురితం అవడం జరిగింది.
![]() | ReplyForward |