Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ స్టార్ట్ అయిన నాటినుండి హౌస్ లో కెప్టెన్ ఎవరో తెలియకపోయినా కంటెస్టెంట్ బాలాదిత్య అందర్నీ కంట్రోల్ చేస్తూ పెద్దరికంగా వ్యవహరిస్తున్నాడు. హౌస్ లో మిగతా కంటెస్టెంట్ లు సైతం బాలాదిత్య మాటకి విలువ ఇస్తున్నారు. కాగా ఈ సీజన్ స్టార్ట్ అయినా నాటి నుండి హౌస్ లో మొదటి నుండి ఫ్రస్టేషన్ తో ఊగిపోతున్న లేడి కంటెస్టెంట్ ఇనాయా సుల్తానా. మొదటి ఎపిసోడ్ గీతు రాయల్ టార్గెట్ చేసిన నాటినుండి సుల్తానా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది. పైగా ట్రాష్ గ్రూప్ లో ఉండి రెండు టాస్కులు ఓడిపోవడం ఆమెకు పెద్ద మైనస్ గా మారింది. దీంతో నేరుగా మొదటివారం ఎలిమినేషన్ కి నామినేట్ కావడం జరిగింది.
ఈ పరిణామంతో సుల్తానా హౌస్ లో చాలామంది పై ఫ్రస్టేషన్ తో ఊగిపోతూ గొడవలు కూడా పెట్టేసుకుంటూ ఉంది. “రోల్ బేబీ రోల్” ఫిజికల్ టాస్క్ ఓడిపోయిన తర్వాత ఆదిరెడ్డి పై గొడవ వేసుకున్న సుల్తానా ఆ తర్వాత మూడో ఎపిసోడ్ లో ఆరోహిపై గొడవ వేసుకోవడం జరిగింది. ఈ రకంగా ఫ్రస్టేషన్ తో ఊగిపోతున్న సుల్తానా నాలుగో ఎపిసోడ్ లో బాలాదిత్యతో గొడవకు దిగింది. మీరు ఏదైనా మొహం మీద చెప్పేస్తే బాగుంటుందన్నీ ఆదిత్యకి డైలాగ్ వేసింది. దీంతో మీ బుర్రలో ఎలా మాట్లాడితే మీకు నచ్చుదో…స్కాన్ చేసి…స్కెచ్ వేసి..ప్లాన్ వేసి నేను చెప్పలేను..అంటూ బాలాదిత్య…సుల్తానాకి కౌంటర్ ఇవ్వడం జరిగింది.
ఏదైనా ముఖం మీద చెప్పేయండి అంటూ.. సుల్తానా ఫ్రస్టేషన్ తో తెగ ఊగిపోయింది. ఇదే క్రమంలో రేవంత్ నామినేట్ అయ్యి బాగా పానిక్ అయినట్లు సుల్తానాకి తెలియజేసి ఆమెకు బాలాదిత్య నచ్చ చెబుతున్నాడు. మొత్తం మీద చూస్తే మొదటివారం ఎలిమినేషన్ కి నామినేట్ కావటంతో సుల్తానా ఇంటిలో ఎవరితో పడితే వారితో గొడవలకు దిగుతున్నట్లు నాలుగో ఎపిసోడ్ ప్రోమోలో కనబడింది.