పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఎఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న చిత్రం హరిహరవీరమల్లు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఇప్పటి వరకు చేయని పీరియాడికల్ జోనర్ కథాంశం కావడం సినిమాపై మొదటి నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. ఇక సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్స్, క్యారెక్టర్ సరికొత్తగా ఉండటంతో ఇప్పటికే సినిమా హాట్ టాపిక్ అయ్యి కూర్చుంది. అయితే ఓ వైపు కరోనా ఎఫెక్ట్, మరో వైపు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం సినిమాపై కొంత ప్రతికూలత చూపిస్తుంది. పవన్ కళ్యాణ్ కారణంగా సినిమా ఆలస్యం జరుగుతుందని ఈ విషయంలో నిర్మాత ఎఎం రత్నం చాలా నష్టపోతున్నారనే ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చారు.
అసలు ఇందులో ఎలాంటి వాస్తవం లేదని నిర్మాత తాజాగా క్లారిటీ ఇచ్చేసారు. ఈ సినిమా అనుకున్న బడ్జెట్ కి మించి పెరిగే అవకాశం లేదని చెప్పేసాడు. ఇప్పటికే సినిమాకి సంబందించిన కీలక ఎపిసోడ్స్ అన్ని చిత్రీకరణ జరిగిపోయిందని, మెజారిటీ షూటింగ్ కంప్లీట్ అయ్యిందని చెప్పేసాడు. ఇక పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకి సంబందించిన యాక్షన్ గ్లిమ్ప్స్ రిలీజ్ చేశారు. ఈ విజువల్ ట్రీట్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. పవన్ కళ్యాణ్ కెరియర్ లో మొట్టమొదటి పాన్ ఇండియా మూవీగ ఇది తెరకెక్కుతుంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకి సంబందించిన బిజినెస్ ఇండస్ట్రీలో అందరిని షాక్ కి గురి చేస్తుంది. వీడియో గ్లిమ్ప్స్ తర్వాత చాలా మంది బయ్యర్లకి సినిమా మీద నమ్మకాలు పెరిగాయని, రైట్స్ కోసం చాలా మంది పోటీ పడుతున్నారని తెలుస్తుంది. ఇతర బాషల నుంచి కూడా చాలా మంది మంచి రేటు ఇచ్చి రైట్స్ సొంతం చేసుకోవడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ కి ముందే నిర్మాత ఏఎం రత్నంకి పెట్టిన పెట్టుబడి మొత్తం వెనక్కి వచ్చేలా బిజినెస్ లెక్కలు చూసుంటే తెలుస్తుందని టాక్. కేవలం పవన్ క్రేజ్ తోనే ఈ సినిమా బిజినెస్ మొత్తం జరిగిపోతుందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.