నిన్నటి ఎపిసోడ్‌లో రాధ గురించి మాధవలో భయం పెరిగిపోతుంది. తనని ఎలాగైనా దక్కించుకోవాలని అనుకుంటాడు. రాధేమో చిన్మయిని చీర కట్టి ముస్తాబు చేస్తుంది. అక్కడ దేవుడమ్మ దేవి కోసం స్వయంగా బట్టలు కుడుతుంది. వినాయక చవితి పండగను జరుపుకోవడానికి రెండు కుటుంబాలు సిద్ధమవుతాయి. ఆ తర్వాత సెప్టెంబర్ 8 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఓ లుక్కేద్దాం..
‘అరెరే ఏంటి మా బంగారం రాధమ్మలాగ తయారయింది’ అంటూ మురిసిపోతారు జానకి, రామ్మూర్తిలు. కానీ దేవీ మాత్రం తన మూడ్ బాగలేదని అందర్నీ డిసప్పాయింట్ చేస్తుంది. తను కూడా చెల్లి దగ్గరికి వెళ్తానని మారాం చేస్తుంది. అందరూ వద్దని చెప్పిన వినకుండా వెళ్తానంటుంది. దాంతో సరేనని ఆదిత్యకు ఫోన్ చేయమంటుంది రాధ. రామ్మూర్తి ఫోన్ కలిపి ఇవ్వగా రాధ.. పెనిమిటి అనబోతుంది. ‘సారూ.. చిన్మయి కూడా దేవమ్మ దగ్గరికి వస్తానంటుంది’ అని చెబుతుంది. సరే కారు పంపిస్తానంటాడు ఆదిత్య.
ఆ తర్వాత సీన్‌లో దేవుడమ్మ ఇంట్లో వినాయకచవితి వేడుకలు అంగరంగ వైభవంగా మొదలవుతాయి. అందరూ మట్టి విగ్రహాలను చేస్తూ పోటీ పెట్టుకుంటారు. అందులో ఆదిత్య, దేవి టీం గెలుస్తారు. జానకి ఒక్కతే పూజ పనులు చేస్తుంటుంది. అంతలోనే అక్కడికి భాగ్యమ్మ, రామ్మూర్తి వస్తారు అక్కడికి. రాధ అందంగా.. బాపు బొమ్మలా ముస్తాబై వస్తుంది. అది చూసి భాగ్యమ్మ ‘నా బిడ్డ ఎంత ముద్దుగుందో. నా దిష్టే తగిలేలా ఉంది’ అంటుంది. అది చూసి జానకి, తన భర్త షాక్ అవుతారు. దాంతో భాగ్యమ్మ కవర్ చేసుకుంటుంది. పూజ చేస్తున్న రాధను చూసి మాధవ్ మనసులో తనపై ప్రేమ పెంచుకుంటాడు. ఇన్నాళ్లు ఇంతందాన్ని ఎలా మిస్సయ్యాను అనుకుంటూ ఫీల్ అవుతాడు. అది భాగ్యమ్మ గమనిస్తుంది. తన బిడ్డని దురుద్దేశంతో చూస్తున్న మాధవకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంటుంది. చేతిలో ఉన్న వేడి గిన్నెను మాధవకు అంటిస్తుంది. దాంతో అరుస్తాడు మాధవ్. చూసుకొని తేవచ్చు కదా అని అంటారు జానకి, రామ్మూర్తిలు.
ఆ తర్వాత పూజ స్టార్ట్ చేయమని చెప్తాడు మాధవ్. అంతలోనే పిల్లలు కనిపించట్లేదేంటని అడుగుతాడు మాధవ్. ఆఫీసర్ వాళ్లింటికి వెళ్లినట్లు చెప్తారు. దాంతో మాధవ్‌కి ఎక్కడో కాలుతుంది. మనింట్లో పండగ పెట్టుకుని ఎందుకు పంపారని అరుస్తాడు. అంతేగాక ఆఫీసర్‌ని కూడా ఇష్టమొచ్చినట్లు తిడతాడు. దాంతో భాగ్యమ్మ, రాధ కోపం నాశాళానికి అంటుతుంది.
సీన్ కట్ చేస్తే.. దేవుడమ్మ ఇంట్లో పూజకు సర్వం సిద్ధం చేస్తారు. దేవీ కొత్త బట్టలు వేసుకుని చూడముచ్చటగా తయారవుతుంది. తనని చూసి అందరూ తెగ సంతోషపడతారు. దేవీ ఈసారి వినాయక పూజ నీ చేతుల మీద జరగాలని చెబుతుంది దేవుడమ్మ. చిట్టి రుక్మిణి, తను కలిసి వినాయకుడిని అలంకరిస్తామని దేవి చెప్పగా.. వచ్చే సంవత్సరం అది చేస్తుంది లేవే అంటుంది దేవుడమ్మ. వినాయక అలంకరణ పూర్తయ్యేలోపే అక్కా.. అంటూ వస్తుంది చిన్మయి. అక్కాచెల్లెళ్లిద్దరూ ప్రేమగా కౌగిలించుకుంటారు. ‘నువ్ ఇంట్లో లేకపోతే నాకేం బాలేదు. అందుకే వచ్చేశా’ అంటుంది చిన్మయి. ‘పిల్లలంటే ఇలా ఉండాలి’ అని పొగడుతుంది దేవుడమ్మ. రాధ ఎలా ఉంటుందో చూడలేదు కానీ పిల్లల్ని మాత్రం చక్కగా పెంచిందని ప్రశంసల వర్షం కురిపిస్తుంది. గణపతి వేడుకలు పూర్తిగా చూడాలనుకుంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..