Dethadi Harika: అలేఖ్య హారిక అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ దేత్తడి హారిక అంటే అందరికీ టక్కున ఆమె ముఖచిత్రం కళ్ళ ముందు కనపడుతుంది.సోషల్ మీడియా వేదికగా ఈమె ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ యూట్యూబ్ వీడియోల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా దేత్తడి సిరీస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హారిక అనంతరం దేత్తడి హారికగా మారిపోయారు.
ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఎన్నో రకాల వీడియోలను షేర్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకున్నారు.ఇలా సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈమె ఏకంగా బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో సందడి చేసిన ఈమె ఎక్కువ కాలం పాటు బిగ్ బాస్ కార్యక్రమంలో కొనసాగారు.
బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అలేఖ్య యధావిధిగా యూట్యూబ్ వీడియోలు వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతోంది. అదేవిధంగా పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ విధంగా సెలబ్రెటీగా కొనసాగుతున్నటువంటి హారిక తాజాగా పుట్టినరోజు జరుపుకోవడంతో ఈమెకు పెద్ద ఎత్తున అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కేవలం అభిమానులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం హారికకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
Dethadi Harika: సంతోషంతో ఉప్పొంగిపోతున్న హారిక…
హారిక పుట్టినరోజు సందర్భంగా సింగర్ నోయల్ తనకు ఊహించని విధంగా సర్ప్రైజ్ ఇస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. హారిక పుట్టినరోజు కావడంతో నోయల్ ఏకంగా తన సిడిపి క్రియేట్ చేసి విడుదల చేశారు.ఇలా తన సిడిపిని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ఈ సంవత్సరం నువ్వు అనుకున్న లక్ష్యాలను చేరాలని కోరుకుంటూ ఈయన తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.తనకు ఈ విధమైనటువంటి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో ఈమె తన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈ పోస్టును షేర్ చేస్తూ నోయల్ ఇచ్చిన సర్ప్రైస్ కు సంతోషంలో ఉప్పొంగిపోతూ థాంక్యూ అంటూ పోస్ట్ షేర్ చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.