Supritha: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి సురేఖవాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎన్నో సినిమాలలో తల్లి, పిన్ని, వదిన, అక్క పాత్రలలో అద్భుతంగా నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరూ సినిమాలలో నటించిన సురేఖవాణి ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు.
నిజం చెప్పాలంటే సినిమాలలో కన్నా ఈమె ఎక్కువగా సోషల్ మీడియాలో సందడి చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇక సురేఖ వానితో పాటు ఆమె కూతురు సుప్రీత కూడా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు.సుప్రీత తన తల్లితో కలిసి చిందులు వేస్తూ పెద్ద ఎత్తున రచ్చ చేయడమే కాకుండా వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.
సుప్రీత ఇంకా వెండితెరకు పరిచయం కాకముందే ఈమెకు హీరోయిన్ రేంజ్ పాపులారిటీ వచ్చిందని చెప్పాలి.ఇలా సోషల్ మీడియాలో ఎంతో ఆక్టివ్ గా ఉంటూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సుప్రీత అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేస్తుంటారు. అయితే తాజాగా ఓ నేటిజన్ ఈమెను పెళ్లి చేసుకుందామా అంటూ అడిగేసారు. ఈ విధంగా నేటిజన్ సుప్రీతను పెళ్లి చేసుకుందామని అడగడంతో ఈమె తనదైన స్టైల్ లో సమాధానం చెప్పింది.
Supritha: పెళ్లి చేసుకుందామన్న నెటిజన్.. అన్నయ్య అని పిలిచిన సుప్రీత
ఈ ప్రశ్నకు సుప్రీత సమాధానం చెబుతూ.. ఈ విషయం మా అమ్మకు చెప్తా నీ సంగతి చెబుతుంది. తరువాత నాకు తెలియదు తెలిసిన నాకు ఏ సంబంధం లేదు భయ్యా అంటూ తనదైన స్టైల్ లో సమాధానం చెప్పింది. అమ్మకు చెప్తా అంటూనే భయ్యా అని అనడంతో ఇది చూసిన ఎంతోమంది నేటిజన్స్ సుప్రీత దిమ్మతిరిగే సమాధానం చెప్పింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సుప్రీత ఈ ప్రశ్నకు సంబంధించిన సమాధానం తన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.