Bigg Boss Season 6 Day 4 First Promo: బిగ్ బాస్ సీజన్ సిక్స్ నాలుగో వారం ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోలో సింగర్ రేవంత్ తాను నామినేషన్ లోకి వెళ్లడంతో బాగా బాధపడుతున్నట్లు ఈ క్రమంలో ఆదిత్య వచ్చి ఓదార్చినట్లు చూపించడం జరిగింది. అంతేకాదు నామినేషన్ ప్రక్రియ అనేది బిగ్ బాస్ లో భాగమేనని పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని.. ఆదిత్య.. రేవంత్ కి నచ్చచెప్పుతున్నాడు. ఇదే సమయంలో సుల్తానా మరోసారి తన ఫ్రస్టేషన్ బయటపెట్టేసింది.
తనని ఆదిత్య టార్గెట్ చేస్తున్నట్లు అతనితో గొడవకు దిగింది. ఇంకా శ్రీ సత్య సైతం మైండ్ బాగుంటే మనసు బాగుంటుందని.. ఆరోహికి వివరణ ఇస్తూ ఉంది. ఇంకా చంటికి అదేవిధంగా గీతు రాయల్ కి మధ్య కూడా గట్టిగానే హోరాహోరీగా గొడవ జరిగింది. సింగర్ రేవంత్ ఇంట్లో ఉంటే గొడవలు జరుగుతాయని తొందరగా అతడు.. హౌస్ నుండి వెళ్ళిపోతే బాగుంటుందని గీతు రాయల్.. మిగతా కంటెస్టెంట్లతో చెప్పటం ప్రోమోలో సంచలనం రేపింది.

ఈ క్రమంలో ఆది రెడ్డి కలుగజేసుకుని రాబోయే రోజుల్లో అతడు మారవచ్చేమో అని బదులు ఇవ్వడం జరుగుద్ది. ఏది ఏమైనా నామినేషన్ సమయంలో గట్టిగ అరిచిన రేవంత్ తనని చాలామంది నామినేట్ చేయడం.. తీసుకోలేకపోయినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ జరిగాక రేవంత్ ఏడ్చినట్లు కూడా ప్రోమోలో అర్థమవుతుంది. మొత్తం మీద నాలుగో వారం ఎపిసోడ్ బిగ్ బాస్ హౌస్ లో ఓదార్పు యాత్ర అన్న తరహాలో పరిస్థితి మారింది.