Bigg Boss Season 6 Day 3 Highlights: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మూడో ఎపిసోడ్ ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ ఉత్కంఠ భరితంగా సాగింది. హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా క్రేజ్ ఉన్న రేవంత్ విషయంలో ఎవరూ కూడా అదురు బెదురు లేకుండా ఎలిమినేషన్ కి ఎక్కువ నామినేట్ అయ్యేటట్లు చేశారు. దీంతో మొత్తం ప్రాసెస్ అయ్యేసరికి రేవంత్, శ్రీ సత్య, చంటి, ఫైమా ఉండటం జరిగింది.
ఇక అంత కు ముందు ట్రాష్ గ్రూపు లో సుల్తానా , ఆదిత్య , అభినయశ్రీ ఉండటంతో మొత్తం ఏడుగురు సభ్యులు ఇంటి నుండి మొదటివారం నామినేషన్ కి ఎలిమినేట్ అయినట్లు ఈ ఏడుగురు పేర్లు బిగ్ బాస్ తెలిపారు. ఇక ఇదే సమయంలో.. చివరిలో చిన్న ట్విస్ట్ ఇవ్వడం జరిగింది. అదేమిటంటే క్లాస్ గ్రూపులో ఉన్న ముగ్గురు గీతు, ఆదిరెడ్డి, నేహా…ట్రాష్ గ్రూప్ లో ఉన్న వ్యక్తిని రీప్లేస్ చేసి మాస్ గ్రూపులో ఉన్న వ్యక్తిని పెట్టాలని తెలిపారు. దీంతో చాలాసేపు డిస్కషన్ చేసుకున్నా క్లాస్ గ్రూప్ సభ్యులు చివరాకరికి సేఫ్ జోన్ లో ఉన్న ఆరోహి నీ ఆదిత్య స్థానంలోకి తీసుకొచ్చారు.
ఆదిత్యాన్ని సేఫ్ జోన్ లో పడేశారు. ఈ పరిణామంతో ఆరోహి.. మొదటి వారం ఎలిమినేషన్ నామినేషన్ లిస్టులో చేరింది. ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియలో సైతం ఆరోహికి కొద్దిపాటి ఓటింగ్ తేడాతో మిస్ అయ్యింది. దీంతో అదే రీసన్ చెప్పి.. మిగతా ముగ్గురు కాస్ గ్రూప్ లో ఉన్నవాళ్లు ట్రాష్ గ్రూపులోకి ఆరోహి నీ తీసుకొచ్చారు.