Bigg Boss Season 6 Day 3 Highlights: బిగ్ బాస్ సీజన్ సిక్స్ టైటిల్ ఫేవరెట్ బరిలో ఉన్న వారిలో సింగర్ రేవంత్ ఒకరు. గతంలోనే మనోడు అనేక షోలలో పాల్గొనడంతో పాటు.. దేశంలోనే పేరుగాంచిన ఇండియన్ ఐడిల్ టైటిల్ విన్నర్ కావడంతో.. అందరి దృష్టి ఈ సీజన్ లో రేవంత్ పై ఉంది. అయితే రేవంత్ బిగ్ బాస్ హౌస్ లో ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న విధానం.. చాలామందికి నచ్చటం లేదు.

చెప్పిన దానినే పదేపదే చెబుతూ ఇంకా రాష్ గా గట్టిగా.. మాట్లాడుతున్నాడని మూడో ఎపిసోడ్ లో ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియలో బిగ్ బాస్ హౌస్ లో సీజన్ 6 లో అందరికంటే ఎక్కువ ఓట్లు రేవంత్ కి పడ్డాయి. హౌస్ లో రేవంత్ ని నామినేట్ చేసిన సభ్యులు చూస్తే సుదీప, ఫైమా, కీర్తి, ఆరోహి, శ్రీహాన్, చంటి, సూర్య నామినేట్ చేశారు. చెబుతున్న విధానం ఇంకా ఎదుట వ్యక్తి పూర్తిగా మాట్లాడుకున్నానే మధ్యలో కలుగ చేసుకుంటున్నారని రేవంత్ పై చాలా మంది రీజన్ చెప్పి నామినేట్ చేశారు.

హౌస్ లో స్ట్రాంగ్ కంటెంట్ అని అనుకున్నా రేవంత్ కి ఫస్ట్ ఎలిమినేషన్ నామినేషన్ లో ఎక్కువ ఓట్లు పడటం సంచలనం రేపింది. బయట మంచి స్ట్రాంగ్ ఫాలోయింగ్ ఉన్నా గాని హౌస్ లో రేవంత్ చాలా సెన్సిటివ్ గా వ్యవహరించటం.. చూస్తున్న ఆడియన్స్ కి కూడా చాలా చిన్నతనంగా ఉంది. మరి రానున్న రోజులో మనోడు ఆట ఏ విధంగా ఉంటుందో చూడాలి.