Bigg Boss Season 6 Day 3 Episode Review: షో స్టార్ట్ అయిన వెంటనే కిచెన్ లో సరిపడా సరుకులు లేవని అందరు అడ్జస్ట్ కావాలని ఆదిత్య హౌస్ మేట్స్ కి తెలియజేశారు. ఉదయానికి టిఫిన్ గా ఫ్రూట్స్ సరిపెట్టుకోవాలని తెలిపారు. ఇక మూడో ఎపిసోడ్ లో బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా సాగింది. ఈ ప్రాసెస్ లో హౌస్ లో జంటగా అడుగుపెట్టిన రోహిత్, మెరీనా ఇద్దరినీ ఒకే వ్యక్తి తరహాలో వారికి ఎలిమినేషన్ చేసే హక్కు ఇవ్వడం జరిగింది. ఇక ఎలిమినేషన్ స్టార్టింగ్ నుండి చూస్తే ప్రారంభం సింగర్ రేవంత్ స్టార్ట్ చేసి..ఫైమా, అరోహీ నీ నామినేట్ చేశారు. ఆ తర్వాత సుదీప.. రేవంత్ మరియు చంటిని నామినేట్ చేశారు. ఆ తర్వాత ఫైమా.. రేవంత్, అర్జున్ నీ నామినేట్ చేసింది. నెక్స్ట్ అర్జున్ వచ్చి..ఫైమా, ఆరోహి నీ నామినేట్ చేశారు. ఆ తర్వాత కీర్తి.. వంతు వచ్చేసరికి రేవంత్, చంటిని నామినేట్ చేసింది.

అనంతరం ఆరోహి వచ్చి రేవంత్, శ్రీ సత్య ని నామినేట్ చేసింది. ఆ తర్వాత రాజ్ వచ్చి శ్రీ సత్య, వాసంతిని నామినేట్ చేశారు. ఇక షానీ.. చంటిని ఇంకా శ్రీ సత్య ని నామినేట్ చేయడం జరిగింది. శ్రీ సత్య.. వాసంతిని అదేవిధంగా రాజ్ ని నామినేట్ చేయడం జరిగింది. రోహిత్ మెరీనా కలిసి ఫైమా, చంటి లనీ నామినేట్ చేశారు. శ్రీహాన్.. రేవంత్ ఇంకా కీర్తిని నామినేట్ చేశాడు. ఆ తర్వాత చంటి వచ్చి రేవంత్ తో పాటు సుదీపాన్ని నామినేట్ చేయడం జరిగింది. చివరిలో సూర్య వచ్చి.. చంటిని అదేవిధంగా రేవంత్ ని నామినేట్ చేశాడు. ఈ ఎలిమినేషన్ నామినేషన్ ప్రాసెస్ మొత్తం చూస్తే ఎక్కువ మంది రేవంత్ ని నామినేట్ చేయడం జరిగింది.

ఆ తర్వాత శ్రీ సత్య కి ఓట్లు పడ్డాయి. చాలావరకు హౌస్ లో ఎలిమినేషన్ నామినేషన్ సభ్యులు రేవంత్ మాట తీరు పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎదుటివారు చెప్పేది వినకుండా కొంచెం రెచ్చగొట్టే విధంగా రేవంత్ మాట తీరుతుందని చాలామంది తమ రీజన్ గా చెబుతూ నామినేట్ చేయడం జరిగింది. ఇంకా శ్రీ సత్య యాటిట్యూడ్ బాలేదని పేర్కొన్నారు. కొంతమంది పనులకు సరిగా హాజరు కావడం లేదని ఎవరికి వారు ఓట్లు వేశారు. చంటి.. ఎలిమినేషన్ చేస్తున్న టైంలో మంచి కామెడీ పండించాడు. అతడు చెప్పిన రీజన్లకు అందరూ నవ్వుతూనే తీసుకుని చాలా ఎంజాయ్ చేయడం జరిగింది. కాగా ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటి నుండి ఎలిమినేషన్ కి నామినేట్ అయిన సభ్యులు రేవంత్, ఫైమా, శ్రీ సత్య, చంటి. అయితే చివరిలో ఇంటిలో ఉన్న సభ్యులకు బిగ్ బాస్ ట్విస్ట్ ఇవ్వడం జరిగింది.
Bigg Boss Season 6 Day 3 Episode Review: బిగ్ బాస్.. చివరిలో ఇంటిలో ఉన్న సభ్యులకు ట్విస్ట్
అదేమిటంటే క్లాస్ గ్రూపులో ఉన్న ముగ్గురు సభ్యులు ట్రాష్ లో ఉన్న ముగ్గురిలో ఒకరిని స్వైప్ చేయొచ్చని సేవ్ చేయొచ్చని అవకాశం ఇచ్చారు. దీంతో క్లాస్ గ్రూపులో ఉన్న గీతు రాయల్, నేహా, ఆదిరెడ్డి ముగ్గురు డిస్కషన్ చేసుకుని.. ఆదిత్యాన్ని సేవ్ చేసి మాస్ గ్రూపులో ఉన్న.. ఆరోహిని ట్రాష్ గ్రూప్ లో సెలెక్ట్ చేశారు. దీంతో హౌస్ నుండి మొదటివారం ఎలిమినేట్ అయిన సభ్యుల లిస్టు చూస్తే సుల్తానా,ఆరోహి, రేవంత్, అభినయశ్రీ, శ్రీ సత్య, ఫైమా, చంటి. మరి వీరిలో ఎవరు హౌస్ నుండి ఎలిమినేట్ అవుతారో చూడాలి.