నిన్నటి ఎపిసోడ్‌లో రాధని జానకి పలురకాలుగా ప్రశ్నించినా.. తన బాధకి కారణమేంటో చెప్పదు. చిన్మయిని చూసి రాధ సంబరపడుతుంది. మరోవైపు దేవేమో కమలబిడ్డను చూడాలని దేవుడమ్మ ఇంటికి వెళ్తుంది. దేవిని వినాయకచవితి పండగ వరకు అక్కడే ఉండమని అడుగుతుంది దేవుడమ్మ. అదే విషయం రాధకు ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఆ తర్వాత ఆగస్టు 7 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
రాధ మాట్లాడింది తన పెనిమిటితో కాదని.. తన అత్తతో అని చెబుతుంది. అది విని మాధవ ఫ్యూజులు ఔట్ అవుతాయి. ఆదిత్య మాట్లాడితేనే రాధ తన మాట వినట్లేదని.. అలాంటిది దేవుడమ్మ మాట్లాడితే తను ఇంటి నుంచే వెళ్లిపోయే ఛాన్స్ ఉందని మాధవలో భయం పెరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో దేవి, రాధని గడప దాటనీయొద్దని అనుకుంటాడు. దానికి తగ్గ ప్లాన్ చేసుకోవాలని అనుకుంటాడు మాధవ. మరోవైపు అత్తతో మాట్లాడిన మాటలు గుర్తుచేసుకుంటుంది రాధ. చిన్మయి ఏమైందమ్మా అని అడగ్గా.. ఏం లేదంటుంది. ‘అవునమ్మా.. నాదొక డౌట్. దేవి నువ్వు ఒకలా మాట్లాడతారు. నేను నాయన ఒకలా మాట్లాడతాం. ఇద్దరం నీ పిల్లలమే కదమ్మా’ అంటూ తన సందేహాలను వెలిబుచ్చుతుంది చిన్మయి. ఏం చెప్పాలా తోచదు రాధకు.
సీన్ కట్ చేస్తే.. దేవుడమ్మ ఇంట్లో దేవి హడావుడి చేస్తుంది. పండగకని దేవికి డ్రెస్సు కోసం కొలతలు తీసుకుంటుంది దేవుడమ్మ. తనకు మిషన్ కుట్టడం వచ్చని దేవుడమ్మ చెప్పడంతో.. దేవి మాయమ్మ కూడా మస్తు పొలం పనులు చేస్తుందంటుంది. అలా కాసేపు రుక్మిణిని గుర్తుచేసుకుంటుంది దేవుడమ్మ. ఇద్దరూ కలిసి సరదాగా గడుపుతారు. అలా ఆ ఇంట్లో దేవితో సందడి నెలకొంటుంది.అక్కడ చిన్మయి నిద్రలో దేవి.. దేవి అని కలవరిస్తుంది. దేవీ అంటూ ఉలిక్కిపడి లేస్తుంది. రాధ లేచి ఏమైందమ్మా అని అడగ్గా.. నాకు దేవి గుర్తొస్తుంది. దేవి లేకపోతే నేనుండలేను. నేను కూడా ఆఫీసర్ సార్ ఇంటికి వెళ్తా. లేకపోతే దేవినైనా తీసుకురమ్మంటుంది చిన్మయి. ఆ మాటలకు రాధ సరేనమ్మా.. పొద్దున వెళ్దువు లే అంటుంది.
అక్కడ దేవి కోసం లంగా, జాకెట్ కుడుతుంది దేవుడమ్మ. అది చూసి మస్తు ఖుషీ అయిపోతుంది దేవి. నిద్రపోతున్న దేవిని వెళ్లిపడుకోమంటుంది దేవుడమ్మ. కుదరదని దేవి చెప్పగా.. నేనే మొండి అంటే నాకంటే మొండి అంటుంది దేవుడమ్మ. నాకు కూడా మిషన్ నేర్పిస్తే నీకు డ్రెస్స్ కుట్టిపెడతానని అంటుంది దేవి. నిద్రలేచి వచ్చిన ఆదిత్య.. ఏంటమ్మా ఈ టైం వరకు కూర్చున్నారు అంటాడు. ఈ చిట్టి రాక్షసితో ఉన్న ఆనందం పడుకుంటే వస్తుందా చెప్పు అంటుంది తల్లి. నా చేతులతో కుట్టిన డ్రెస్స్ వేసుకుంటే దీని ముఖంలో కనిపించిన ఆనందం చూడాలనిపించి కుడుతున్నాని చెబుతుంది దేవుడమ్మ. దేవీ.. నువ్వైనా వచ్చి పడుకోమ్మా అంటే.. అవ్వ ఒక్కతే ఎలా కుడుతుంది. మనం అందరం పడుకుంటే.. నువ్వెళ్లి పడుకో సారు అంటుంది.
అంతలోనే అక్కడకు వచ్చిన సత్య.. ఆదిత్యకు దేవి అంటే ఎందుకు ఇంత ప్రాణం. అత్తయ్యకు అంటే పిల్లలు ప్రాణం. కానీ ఆదిత్యకు ఎందుకు అని ఆలోచిస్తూ బాధపడుతుంది మనసులో. జానకి పూజకు కావల్సిన ఏర్పాట్లు చేస్తుండగా రామ్మూర్తి వచ్చి పిల్లలేరని అడుగుతాడు. దేవి లేదు కదా అంటూ బాధపడుతుంది జానకి. చిన్మయికి చీర కట్టి ముస్తాబు చేస్తుంది రాధ. చీర కట్టి సింగారిస్తే ఎంత ముద్దుగున్నావో.. నా దిష్టే తగిలేలా ఉన్నావంటూ, తాత నాయనమ్మల దగ్గరికి తీసుకెళ్తుంది. చిన్మయిని చూసి జానకి, రామ్మూర్తి మురిసిపోతారు. కానీ చిన్మయి మాత్రం తన మూడ్ బాలేదని అంటూ అందర్నీ అప్‌సెట్ చేస్తుంది. ఏందమ్మా అలా అంటావ్ అని రాధ అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుందా.. అయితే వెయిట్ చేయాల్సిందే!