పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లైగర్ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చిన డిజాస్టర్ అయ్యింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఇక సినిమాకి కూడా దేశ వ్యాప్తంగా చాలాగట్టిగా ప్రమోషన్ చేశారు. ఈ కారణంగా ఫస్ట్ డే ఊహించని స్థాయిలో భారీ కలెక్షన్స్ వచ్చాయి. అయితే మొదటి ఆట నుంచి సినిమాకి డివైడ్ టాక్ రావడంతో రెండో రోజు నుంచి భారీగా కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. ఈ సినిమాతో సుమారు అరవై కోట్ల వరకు నిర్మాతలైన చార్మి, కరణ్ జోహార్ నష్టపోయినట్లు తెలుస్తుంది.
అయితే లైగర్ ఫ్లాప్ కారణంగా చార్మి భాగా ఆవేదనకి గురైంది. తాను కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం ఈ సినిమా మీద పెట్టుబడిగా పెట్టడంతో అది కాస్తా చిత్రం ఫ్లాప్ కారణం నష్టపోవడంతో కాస్తా ఒత్తిడికి కూడా గురైంది. ఈ నేపధ్యంలోనే తాజాగా ఆమె ట్విట్టర్ కి కూడా ఫుల్ స్టాప్ పెట్టి సైలెంట్ అయిపొయింది. అది ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్ లో లైగర్ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. లైగర్ సినిమాకి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత దగ్గర ఉన్న బ్లాక్ మనీని పెట్టుబడిగా పెట్టిందని కాంగ్రెస్ లీడర్ ఆరోపించారు. లైగర్ సినిమాకి సంబందించిన లావాదేవీలు బయటకి తీస్తే ఈ విషయం జా బయటపడుతుందని కూడా అన్నారు.
అయితే బ్లాక్ మనీని పెట్టి సినిమా తీసేంత డబ్బు కల్వకుంట్ల కవిత దగ్గర ఉందా అనే టాక్ నడిచింది. అయితే ఆమె పెట్టింది బ్లాక్ మనీ కాదని, లైగర్ సినిమాకి కొంత మంది చిన్న చిన్న మొత్తాలు పెట్టుబడిగా పెట్టి నిర్మాణ భాగస్వామి అయినట్లు తెలుస్తుంది. అలా కవిత కూడా ఇందులో కొంత మొత్తం పెట్టుబడి పెట్టిందనే మాట వినిపిస్తుంది. అయితే డైరెక్ట్ గా సినిమాతీసేంత డబ్బు ఆమె దగ్గర ఉన్నప్పుడు ఇలా లైగర్ నిర్మాణంలో సీక్రెట్ పార్టనర్ కావాల్సిన అవసరం ఏముందనే మాట కూడా వినిపిస్తుంది. మరి ఇందులో వాస్తవం ఏంటనేది మాత్రం ఆమె స్పందిస్తే కాని తెలియదు.