టాలీవుడ్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి ఇషారెబ్బ. తెలుగమ్మాయి అనే ఇమేజ్ తో హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో మొదటి సినిమాతో ఈ అమ్మడు హిట్ కొట్టింది. తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుసగా సినిమాలు చేస్తుంది. అయితే స్టార్ హీరోయిన్ ఫీచర్స్ ఉన్న కూడా కేవలం తెలుగమ్మాయి అనే ఒకే ఒక ట్యాగ్ ఈమెకి పెద్ద సినిమాలలో ఆఫర్స్ రాకుండా చేసింది.
అయితే కొత్త హీరోలు, యంగ్ హీరోలతో అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తున్న ఈ అమ్మడు కన్నడంలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ స్టార్ హీరో శివన్నకి జోడీగా ఒక సినిమాలో నటించింది. ఇక మలయాళంలోకి కూడా తెరంగేట్రం చేసింది. ఇక ఆ ఆ సినిమా కోసం ఇప్పటి వరకు చేయని విధంగా గ్లామర్ షోకి ఇషారెబ్బ తెరతీసినట్లు తెలుస్తుంది. ఇక ఇషా అప్పుడప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్ లతో సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. అయితే ఎంత అందాల ప్రదర్శన చేసిన ఈమె మీద తెలుగు దర్శకులు శ్రద్ధ పెట్టడం లేదు.
దీంతో సౌత్ లో ఇతర బాషలలోకి వెళ్లి ప్రయత్నాలు చేసుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఇషారెబ్బ మీద ఒక హాట్ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. గత కొంతకాలంగా ఈ బ్యూటీ ఓ తమిళ్ దర్శకుడితో డీప్ లవ్ లో ఉందనే మాట వినిపిస్తుంది. ఇక త్వరలో అతనితో పెళ్లి పీటలు కూడా ఎక్కడానికి రెడీ అవుతుందని టాక్. ఇప్పటికే పెద్దలని కూడా తన పెళ్లి విషయంపై ఒప్పించిందని, వాళ్ళు అంగీకారం తెలపడంతో మూడుముళ్ల బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలని భావిస్తుంది అనే మాట వినిపిస్తుంది. మరి ఈ వార్తలలో వాస్తవం ఎంత అనేది ఆమె స్పందిస్తే గాని తెలియదు.