Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ 6 మూడో ఎపిసోడ్ మరికొద్ది గంటల్లో ప్రసారం కానుంది. అయితే ఇప్పటికే మూడో ఎపిసోడ్ కి సంబంధించి..ప్రోమో రిలీజ్ అయింది. ఇంటిలో 15 సభ్యుల మధ్య ఎలిమినేషన్ నామినేషన్ ప్రాసెస్ పెట్టడం జరిగింది. రెండు గ్రూపులుగా విభజించి ఎవరిని ఎలిమినేట్ చేస్తున్నారో దానికి కారణం చెప్పే విధంగా గతంలో మాదిరిగానే ఎలిమినేషన్ నామినేషన్ ప్రాసెస్ జరిగింది. ఇదిలా ఉంటే యధావిధి గానే గత సీజన్ ల మాదిరిగానే… ముందుగానే ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయో లీక్ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిలో భాగంగా సీరియల్ నటి శ్రీ సత్యకి భారీ ఎత్తున ఓట్లు పడినట్లు.. ఆమె మొదటి వారం ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యే సభ్యులలో ఉన్నట్లు సమాచారం.

శ్రీ సత్యతో పాటుగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ లు బయట ఫ్యాన్ బేస్ కలిగిన రేవంత్ ఇంకా మరి కొంతమంది మొదటి వారం నామినేట్ అయిన లిస్టులో ఉన్నారట. ఈ పరిణామంతో మొదటివారం ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా శ్రీ సత్య కి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె సరిగ్గా ఒక టాస్క్ లో పాల్గొనలేదు, సరైన స్క్రీన్ స్పేస్ వచ్చే విధంగా కూడా..హౌస్ లో పెద్దగా మాట్లాడిన సందర్భాలు లేవు.
Bigg Boss 6: హౌస్ లో పెర్ఫార్మెన్స్ పరంగా
ఇక ఇదే క్రమంలో నామినేషన్ ప్రాసెస్ లో వాసంతికి మరియు శ్రీ సత్య కి మధ్య కూడా గట్టిగానే వాగ్వాదం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే పెర్ఫార్మెన్స్ పరంగా ఇప్పటివరకు శ్రీ సత్య.. హౌస్ లో పెద్దగా రాణించ లేదన్న టాక్ బయట బలంగా వినబడుతుంది. దీంతో బిగ్ బాస్ సీజన్ 6 మొదటివారం.. ఎలిమినేట్ అయ్యే అమ్మాయి శ్రీ సత్య అని బయట జనాలు మూడో రోజు ఎలిమినేషన్ ఎపిసోడ్ గురించి డిస్కషన్ చేసుకుంటున్నారు.