Shanmukh : యూట్యూబ్ స్టార్‌గా గుర్తింపు పొందిన షణ్ముఖ్ జశ్వంత్ బిగ్‌బాస్ సీజన్ 5లో ఎంట్రీ ఇచ్చి మరింత పాపులర్ అయ్యాడు. మంచి ఆట తీరుతో పాటు సిరి హన్మంతుతో చాలా క్లోజ్‌గా ఉండటం వంటి అంశాలతో బాగా హైలైట్ అయ్యాడు. షణ్ముఖ్‌కు బిగ్‌బాస్ ద్వారా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది. వెబ్ సిరీస్ ద్వారా అప్పటికే బాగా పాపులర్ అయి ఉండటం కూడా షన్నుకి కలిసొచ్చింది. నిజానికి సిరీతో అంత క్లోజ్‌గా ఉండకపోతే మాత్రం సీజన్ 5 విన్నర్ షన్నుయే అయి ఉండేవాడు. కానీ ఆమెతో క్లోజ్‌గా ఉండటంతో చాలా బ్యాడ్‌ను కూడా మూటగట్టుకున్నాడు. ఫైనల్‌గా టైటిల్ పోయింది. అతని ప్రియురాలు దీప్తి సునైనా బ్రేకప్ చెప్పి అతని జీవితం నుంచి తప్పుకుంది. రన్నరప్‌గా హౌస్ నుంచి బయటకు వచ్చాడు.
సిరి హన్మంతుతో నడిపిన వ్యవహారం విపరీతంగా వైరల్ కావడంతో దీప్తి బ్రేకప్ చెప్పిందని తెలుస్తోంది. నిజానికి వీరిద్దరికీ సోషల్ మీడియాలో క్యూట్ పెయిర్ అని పేరుంది. వీరిద్దరూ విడిపోవడం అభిమానులకు సైతం నచ్చలేదు. ఈ క్రమంలోనే సిరి హన్మంతుపై షన్ను, దీప్తి అభిమానులు విపరీతంగా విమర్శలు గుప్పించారు. లవ్ బ్రేకప్‌లో కొంతకాలం డిప్రెషన్‌లోకి వెళ్లిన షణ్నూ సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడిప్పుడే తిరిగి యాక్టివ్ అవుతున్నాడు. ఇక ఇటీవల తిరిగి తన డ్యాన్స్ వీడియోలు షేర్ చేస్తున్నాడు. తిరిగి కెరీర్‌పై ఫోకస్ పెట్టాడు.
Shanmukh : తాను బాగానే ఉన్నానంటూ మరో పోస్ట్
షన్నూ రీసెంట్‌గా ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్’ సిరీస్‌తో ఫ్యాన్స్‌ని పలకిరించాడు. ఒకవైపు డ్యాన్స్ వీడియోలు, మరోవైపు వెబ్ సిరీస్‌తో షన్నూ బిజీగా ఉంటూ తన ఫాలోవర్స్‌లో మళ్లీ జోష్ నింపుతున్న క్రమంలో తాజాగా అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా తెలిపాడు. ఆస్పత్రి బెడ్‌పై ఉన్న తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. ‘బర్త్ డే నెల స్టార్ట్ అయింది. దిష్టి తగిలింది’ అంటూ తాను హాస్పిటల్ బెడ్‌పై ఉన్న పిక్‌ను సోషల్ మీడియాలో షన్ను షేర్ చేశాడు. దీంతో అతడి ఫాలోవర్స్ అంతా షణ్నూకి ఏమైందా? అని ఆందోళన వ్యక్తం చేస్తుండంతో కొద్ది సేపటికే తాను బాగానే ఉన్నానంటూ మరో పోస్ట్ పెట్టాడు. దీంతో అతడి ఫాలోవర్స్ కాస్తా ఊపరి పీల్చుకున్నారు. అయితే తన అనారోగ్యానికి గల కారణమేంటన్నది మాత్రం అతడు వెల్లడించలేదు.