Allu Arjun: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతూ సౌత్ ఇండస్ట్రీలోని అగ్ర హీరోలలో ఒకరిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే ఈయన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో నటించిన పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు. ఇలా పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.
ఇలా పుష్ప సినిమాలో పుష్ప రాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో అల్లు అర్జున్ నటన ప్రతి ఒక్కరిని ఫిదా చేసిందని చెప్పాలి. ముఖ్యంగా ఈయన మాస్ లుక్, తన మ్యానరిజం కేవలం సౌత్ ప్రేక్షకులను మాత్రమే కాకుండా నార్త్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుందని చెప్పాలి. ముఖ్యంగా ఇందులో అల్లు అర్జున్ చెప్పే తగ్గేదేలే అనే డైలాగ్ ఎంతో పాపులర్ అయింది.ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఊహించని విధంగా కలెక్షన్లను రాబట్టడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రాన్ని భారీగా ప్లాన్ చేస్తున్నారు.
ఇక త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతోంది. ఇకపోతే ఈ సినిమాలో నటి ప్రియమణి కీలక పాత్రలో నటించబోతుందనే సమాచారం వినపడుతుంది.గతంలో అల్లు అర్జున్ తన సినిమాలో నటించే అవకాశం తప్పకుండా వస్తుందని ప్రియమణి మాటిచ్చారు. ఇలా మాట ఇచ్చిన ప్రకారమే ఆయన తాను నటిస్తున్నటువంటి పుష్ప 2 సినిమాలో ప్రియమణి అవకాశం కల్పించినట్టు సమాచారం. ప్రియమణి వెండితెర నటిగా పలు సినిమాలలో నటించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే ఈమె బుల్లితెరపై ప్రసారమయ్యే ఢీ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్న సమయంలో అల్లు అర్జున్ ఢీ 13 గ్రాండ్ ఫినాలేకి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
Allu Arjun: చాలా హాట్ గా ఉన్నారంటూ ప్రియమణి పై కామెంట్ చేసిన అల్లు అర్జున్
ఈ క్రమంలోనే ప్రియమణి మాట్లాడుతూ తాను అల్లు అర్జున్ సినిమాలో నటించలేకపోయానని చెప్పడంతో వెంటనే అల్లు అర్జున్ ఏం పర్వాలేదు తన సినిమాలో నటించలేదని ఫీల్ కావద్దు ఇప్పటికీ నా సినిమాలో నటించవచ్చు పైగా ఇప్పుడు ఇంకా చాలా స్లిమ్ గా చాలా హాట్ గా తయారయ్యారు అంటూ గతంలో ప్రియమణి గురించి అల్లు అర్జున్ కామెంట్స్ చేశారు.ఇలా తన సినిమాలలో నటించవచ్చు అంటూ అల్లు అర్జున్ అప్పుడు చేసిన కామెంట్స్ ఇప్పుడు నిజమయ్యాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే పుష్ప 2 సినిమాలో ప్రియమణి కీలకపాత్రలో నటించబోతుందని సమాచారం అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.