కార్తీక్‌కి దీప దగ్గర అవుతోందని కుళ్లుకుంటూ ఉంటుంది మోనిత. దీప కూడా కార్తీక్‌కి గతం గుర్తు చేసేందుకు వరుస ప్రయత్నాలు చేస్తుంటుంది. దాంతో.. పరిస్థితి విషమించక ముందే కార్తీక్‌ని తీసుకుని ముంబై వెళ్లాలని మోనిత ఫిక్స్ అవుతుంది. దాంతో.. అతని కుటుంబం ముంబైలోనే ఉందని, ఉన్నవి లేనివి కల్పించి చెబుతుంది. అలాగే.. వెళ్లేముందు దీప మీద కార్తీక్‌కి ఉన్న మంచి ఓపినియన్‌ని మార్చాలని అనుకుంటుంది. అందుకే కావాలనే టిఫిన్ నుంచి డిన్నర్ వరకూ అన్ని దీపనే చేయమని చెబుతుంది. దాంతో.. టిఫిన్ తయారు చేసి మోనిత ఇంటికి తీసుకువెళుతుంది. అది తిని వాంతులు చేసుకుని కళ్లు తిరిగి పడిపోతుంది మోనిత. అది చూసి మోనిత మళ్లీ ఏదో నాటకం మొదలు పెట్టిందని అని పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 6 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
మోనితకి ఏం జరిగిందోనని కంగారు పడుతుంటాడు కార్తీక్. వెంటనే డ్రైవర్ శివని పిలిచి డాక్టర్‌కి ఫొన్ చేయమని మోనితని లేపే ప్రయత్నం చేస్తాడు. అది చూసి మోనిత ఏం నాటకం ఆడుతుందోనని అనుమానపడుతుంది మోనిత. అనంతరం దీపని వెళ్లమని చెబుతాడు కార్తీక్. దీప అటు వెళ్లగానే డాక్టర్ వచ్చి చెక్ చేసి ఫుడ్ పాయిజన్ అయ్యిందని చెబుతాడు. తరువాత సీన్‌లో అదంతా నాటకమని అర్థమవుతుంది. ఆ డాక్టర్‌కి ముందే ఫోన్ చేసి ఏం చేయాలో చెప్పి ఉంటుంది మోనిత. అందుకే హాస్పిటల్‌కి మారగానే జాగ్రత్త మాట్లాడమని డాక్టర్‌కి కార్తీక్‌ని లోపలికి పిలవమని చెబుతుంది.
ఇంతలో.. అదే హాస్పిటల్‌కి బాక్సులు తీసుకుని వస్తారు వారణాసి, సౌర్య. వాళ్లు లోపలికి వెళ్లేలోపు డాక్టర్ వచ్చి బయట కూర్చొని ఉన్న కార్తీక్‌ని తీసుకెళ్లిపోతాడు. ఇంతలో లోపలికి వచ్చిన సౌర్య.. పక్కనుంచే మోనిత ఉన్న గదిలోకి వెళతాడు కార్తీక్. అతను లోపలికి వెళ్లగానే నాటకం మొదలుపెడుతుంది మోనిత. దాంతో.. ‘దీప నీ మీద కన్నేసి కావాలనే టిఫిన్‌లో విషం కలిపింది. నన్ను చంపేసి నిన్ను సొంతం చేసుకోవాలని ప్లాన్ వేసింది’ అని దీప మీద ఉన్నవి లేనివి కల్పించి చెబుతుంది. కానీ.. కార్తీక్ తన మాటలు నమ్మడు. దాంతో.. ‘నీకు దీప అంటే ఇష్టం ఉందా. అందుకే నాకు ఇలా ఉన్నా పట్టించుకోకుండా అలా మాట్లాడుతున్నావా. పోయి ఏదో ఒకటి చేయి’ అని కార్తీక్‌ని రెచ్చగొడుతుంది. దాంతో ఆవేశంగా దీప దగ్గరికి బయలు దేరతాడు కార్తీక్.
హాస్పిటల్ నుంచి శివతో కలిసి బయలుదేరతాడు. వాళ్లు అటువెళ్లగానే సౌర్య, వారణాసి కూడా ఆటోలో వెళ్లిపోతారు. మరోవైపు.. దీప జరిగిన విషయం అంతా ఫోన్‌లో డాక్టర్ అన్నయ్యకి చెబుతుంటుంది. ఇంతలో ఆవేశంగా అక్కడికి వచ్చిన కార్తీక్.. దీపని నానా మాటలు అంటాడు. ‘నా భార్యకి ఎందుకు విషం పెట్టావు. నా మీద ఆశపడ్డావా. నేను నీ డాక్టర్ బాబుని కాదు అని చెప్పిన వినవేందుకు. భార్యభర్తల బంధం అంటే జన్మ జన్మల బంధం. అందుకే పరాయి స్త్రీ భర్త మీద ఆశలు పెట్టుకోకు. ఇంకెప్పుడు నీ ముఖం నాకు చూపించకు’ అని కోపంగా అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు కార్తీక్. కార్తీక్ మాటలు విని కన్నీరుమున్నీరవుతుంది దీప. తను పరాయి స్త్రీ భర్తపై ఆశపడడం ఏంటి. ఇలాంటి పరిస్థితి తెచ్చావేంటని దేవుడితో మొరపెట్టుకుంటుంది.
మరోవైపు.. అమ్మనాన్న గురించే ఆలోచిస్తూ ఉంటుంది సౌర్య. హిమ సౌర్య పుట్టినరోజున దీప వంట చేయడం.. కార్తీక్ తిట్టడం గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటుంది. అది గమనించి ఏం ఆలోచిస్తున్నావని వారణాసి అడుగుతాడు. ఇంకేం ఉంటుంది అమ్మనాన్న గురించే ఆలోచిస్తున్నానని చెబుతుంది. దాంతో వెతుకుతున్నాం కదా అని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది వారణాసి. దాంతో.. ఇంతవరకూ నాన్నతో సరిగా టైమ్ స్పెండ్ చేయలేదని అంటుంది సౌర్య. తర్వాత.. ఉదయమే గుడి తీసుకెళ్లమని సౌర్య చెప్పడంతో ఓకే అంటాడు వారణాసి.
ఇంకోవైపు.. డాక్టర్ అన్నయ్య ఇంటికి వెళ్లిన దీప జరిగిన విషయమంతా డాక్టర్‌కి, ఆయన తల్లికి వివరిస్తుంది. అది విని.. పెద్దావిడ నిజంగా విషం కలిపి మోనితకి ఇస్తే పీడ విరగడయ్యేది కదా అని కోపంగా అంటుంది. దాంతో.. తల్లిని కూల్ చేసి, డాక్టర్ బాబు ఉదయం లేవగానే అన్ని మర్చిపోతాడు కదా. బాధపడకు అని సర్ది చెబుతాడు డాక్టర్ అన్నయ్య. పిల్లల పుట్టిన రోజు సందర్భంగా గుడిలో పూజ చేసి ఇంటికి వస్తానని వారిని ఇంటికి పంపిస్తుంది దీప. తరువాయి భాగం అంటూ.. గుడికి వెళ్లిన కార్తీక్‌తో దీపని మరోసారి కలవనని ఒట్టు వేయమని చెబుతుంది మోనిత. ఇంతలో.. అక్కడికి వచ్చిన దీప తనేం చేయాలేదంటూ తన పిల్లలపై ఓట్టు వేస్తుంది. ఇంతలో అక్కడే బయట దేవుళ్ల చుట్టూ తిరుగు ప్రదక్షిణలు చేస్తుంటుంది సౌర్య. అది మోనిత కంట్లో పడుతుంది. దీప ఆమెని గమనిస్తుంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో లేదో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.