Bigg Boss Season 6 Day 2 Highlights: బిగ్ బాస్ సీజన్ సిక్స్ స్టార్ట్ అయిన నుండి హౌస్ లో దెబ్బ మీద దెబ్బ ఇనయా సుల్తానాకి తగులుతూనే ఉంది. మొదటి రోజే బాత్రూంలో వెంట్రుకల గొడవ విషయంలో గీతు రాయల్..ఇనయా సుల్తానానీ గట్టిగా టార్గెట్ చేసింది. ఇష్టానుసారంగా మాట్లాడింది. దాంతో బాగా కృంగిపోయిన సుల్తానా.. అదే సమయంలో క్లాస్, మాస్, ట్రాష్ టాస్క్ వచ్చేసరికి..ట్రాష్ కి ఆమె చేరడంతో నామినేషన్ జోన్ లో ఉండటంతో.. చాలా అభద్రతాభావానికి గురైంది.
మొదటిరోజు ట్రాష్ నుండి తప్పించుకునే అవకాశం.. కల్పించే టాస్క్ “బోండంతో యుద్ధం”..లో ఆదిరెడ్డి పై ఓడిపోయింది. దీంతో రెండో రోజు ఎపిసోడ్ లో కూడా..”రోల్ బేబీ రోల్” టాస్క్ లో నేహా పై ఓడిపోవడంతో సుల్తానా చాలా ఫ్రస్టేషన్ కి గురైంది. ఈ క్రమంలో ఆది రెడ్డితో కూడా గొడవకు దిగింది. టాస్క్ మధ్యలో ఓడిపోయిన తర్వాత కూడా ఆదిరెడ్డి పై గట్టిగానే కేకలు వేసింది. బాత్రూంలోకి వెళ్ళిపోయి మరి ఏడిచింది. ఇంక రెండో రోజు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే గీతు రాయల్.. టార్గెట్ చేసి మరి పనులు చెప్పటంతో సుల్తానా ఆమెపై కూడా అరిచేసింది.
హౌస్ లో తనని ఎవరు సపోర్ట్ చేయడం లేదని.. ఓపెన్ గానే కామెంట్లు చేయటం గమనార్హం. దీంతో గీతూ రాయల్ మరియు రేవంత్.. ఇక్కడ ఎవరికి వారు తమ సత్తా చూపియ్యాలి అంటూ.. సుల్తానా కి క్లాస్ పీకారు. ఏది ఏమైనా ట్రాష్ గ్రూప్ లో ఉంటూనే రెండు టాస్కులు ఓడిపోవడంతో.. మొదటివారం ఇనయా సుల్తానా ఎలిమినేషన్ కి నామినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించేశారు.