Bigg Boss Season 6 Day 2 Highlights: బిగ్ బాస్ సీజన్ సిక్స్ స్టార్ట్ అయిన నాటి నుండి గీతు రాయల్ పేరు మారుమొగుతుంది. హౌస్ లో అడుగు పెట్టిన నాటి నుండి గీతు ఎటాకింగ్ మూడ్ అన్న తరహాలో ఆడలేదు మగా లేదు ఎవరి మీద పడితే వారి మీద కసగుసలాడుతూ ఉంది. ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా చేస్తూ వీక్ కంటెస్టెంట్లను టార్గెట్ చేస్తూ.. తనదైన గేమ్ ప్లాన్ మొదటి రోజే స్టార్ట్ చేసి వార్తలు లో నిలిచింది. ఈ క్రమంలో సుల్తానా.. గీతు రాయల్ కి టార్గెట్ అయిపోయింది. బాత్రూంలో వెంట్రుకల గొడవ నుండి రెండో రోజు ఎపిసోడ్ లో క్లాస్ గ్రూపు కి సెలెక్ట్ అయ్యాక పనులు చేపించుకోవడంలో సుల్తానా కి గీతు రాయల్ చుక్కలు చూపించింది.

Bigg Boss Season 6 Day 2 Highlights: ఆమెపై నెగటివ్ ఇంప్రెషన్
మొదటి రోజు అందరినీ తిట్టేసి బిగ్ బాస్ చెప్పిన కానీ నేను వినను, ఇంకా తమ గురించి చెప్పాలని ఇచ్చిన టాస్కులు ఆమె ఏడుపు కూడా చాలామందికి నచ్చలేదు. దీంతో మొదటి రోజు గీతు ఆట చూశాక చాలా వరకు ఆమెపై నెగటివ్ ఇంప్రెషన్ ఆల్మోస్ట్ ఆల్ అందరికీ క్రియేట్ అయిపోయింది. కచ్చితంగా మొదటి వారం సీజన్ సిక్స్ లో గీతు రాయల్.. ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యే మొదటి కంటెస్టెంట్ అని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా రెండో రోజు ఎపిసోడ్ స్టార్ట్ అయిన ప్రారంభంలో బిగ్ బాస్ ట్రాష్ గ్రూప్ నుండి క్లాస్ గ్రూప్ లోకి ఎవరు వెళ్తారు.. అని డిస్కషన్ చేసుకోవాలని తెలపడంతో రేవంత్ ఒప్పుకోవటం..గీతు రాయల్ క్లాస్ గ్రూపులోకి వెళ్లడం జరిగింది.
ఈ పరిణామంతో గీతు రాయల్.. అనుకోకుండా రెండో రోజునే ఈ వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ నుండి తప్పించుకున్నట్లు బిగ్ బాస్ ప్రకటించేశారు. దీంతో రెండో రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత బిగ్ బాస్ ఆడియన్స్ లక్ అంటే గీతు దే.. ఏమాత్రం ఆమె ఎలిమినేషన్ నామినేషన్ లో ఉంటే.. కచ్చితంగా ఇంటి నుండి వెళ్లిపోయే పరిస్థితి ఉండేది అని అంటున్నారు.