Bigg Boss Season 6 Day 2 Episode Review: బిగ్ బాస్ సీజన్ సిక్స్ రెండో రోజు ఎపిసోడ్ లో కంటెస్టెంట్లు మరింత ఓపెన్ అయ్యారు. సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ అయిన వెంటనే అర్జున్.. ప్రతిసారి రేవంత్ ఇతరుల విషయంలో జోక్యం చేసుకుంటూ మాట్లాడటంతో నెగిటివ్ అవుతున్నట్లు అతనికి సలహా ఇచ్చాడు. ఇదే విషయాన్ని అర్జున్.. వాసంతి తో డిస్కషన్ చేయడం జరిగింది. చాలావరకు చూస్తే స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా హౌస్ లోపల పిలవబడుతున్న రేవంత్ కి అర్జున్ సలహాలిస్తూ అతన్ని మంచిగా చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్థమవుతుంది. సెకండ్ డే ఎపిసోడ్ స్టార్ట్ అయిన సమయానికి “క్లాస్” గ్రూపులో బాలాదిత్య, సూర్య, ఆదిరెడ్డి ఉన్నారు. ఈ క్రమంలో “ట్రాష్” గ్రూప్ లో రేవంత్, ఇనయా సుల్తానా, గీతు రాయల్ ఉండటం జరిగింది. దీంతో రెండో రోజు బిగ్ బాస్…”ట్రాష్” గ్రూప్ నుండి ఎవరు క్లాస్ గ్రూప్ లోకి వెళ్తారు..? అనేది ఆ గ్రూపులో ఉన్న ముగ్గురు చర్చించుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.
దీంతో ఆల్రెడీ అంతకుముందు “ట్రాష్” లో ఉన్న ఇనయా సుల్తానా.. టాస్క్ ఆడే అవకాశం రావడంతో గీతూ రాయల్ ఇంకా రేవంత్ ఇద్దరు కూడా.. చాలాసేపు డిస్కషన్ చేసుకున్నారు. ఈ క్రమంలో చివర ఆఖరికి రేవంత్..గీతూ రాయల్..క్లాస్ గ్రూప్ కి వెళ్లడానికి ఒప్పుకోవటంతో..”క్లాస్” గ్రూప్ నుండి… బాలాదిత్య..ట్రాష్ కి రావటం జరిగింది. ఈ పరిణామంతో క్లాస్ గ్రూప్ లోకి వెళ్లలేక పోవటంతో రేవంత్ బాత్రూం దగ్గర గుక్క పెట్టి ఏడ్చేసాడు. దీంతో తోటి కంటెస్టెంట్లు రోహిత్ ఇంకా బాలాదిత్య రేవంత్ నీ ఓదార్చాల్సి వచ్చింది. దీంతో క్లాస్ గ్రూప్ కి వెళ్ళినా గీతు రాయల్.. తోటి కంటెస్టెంట్ల చేత సకల సౌకర్యాలు చేయించుకుంది. దీనిలో భాగంగా ఎప్పటిలాగానే ఇనయా సుల్తానా నీ టార్గెట్ చేసి మరి రకరకాల పనులు చెప్పింది. మధ్యలో పాటలు పాడాలని చెప్పడంతో.. సుల్తానా ఒక్కసారిగా గీతు పై సీరియస్ అయ్యింది. ఇంటిలో పనులు చెబితే చేస్తాను. అంతేగాని పాటలు పాడాలని రూలేమీ లేదు అని మండిపడింది. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ సెకండ్ ఛాలెంజింగ్ టాస్క్..”స్లైడ్ జార స్లైడ్” ఇచ్చారు. ఈ టాస్క్ లో ట్రాష్ నుండి… రేవంత్..మాస్ నుండి అభినయశ్రీ పోటీపడ్డారు.

ఈ టాస్క్ లో రేవంత్ గెలవడంతో..ట్రాష్ నుండి మాస్ కి వెళ్లి నామినేషన్ నుండి తప్పించుకున్నారు. అభినయశ్రీ ఓడిపోవడంతో ట్రాష్ గ్రూప్ కి వచ్చేసింది. ఇక ఆ తర్వాత మరో చాలెంజింగ్ టాస్క్ “రోల్ బేబీ రోల్ టాస్క్” ఇవ్వడం జరిగింది. ఈ టాస్క్ లో ట్రాష్ నుండి ఇనయా సుల్తానా..మాస్ నుండి నేహా చౌదరి.. పోటీపడ్డారు. చివర ఆఖరికి నేహా గెలవడంతో.. ఆమె క్లాస్ గ్రూప్ కి వెళ్లిపోయింది. రెండు టాస్కులలో ఇనయా సుల్తానా.. ఓడిపోవడంతో చాలా ఫ్రస్టేషన్ కి గురై తోటి కంటెస్టెంట్లపై అరిచేసింది. దానికి ఎవరు సపోర్ట్ చేయడం లేదని బాత్రూం లోకి వెళ్లిపోయి మరీ ఏడ్చింది. దీంతో క్లాస్ గ్రూపులో ఉన్న ముగ్గురు సభ్యులలో ఒకరైన సూర్య.. మాస్ గ్రూప్ కి వచ్చేశారు. రెండో రోజు ఎపిసోడ్ ముగిసే సమయానికి క్లాస్ గ్రూపులో ఉన్న ఆదిరెడ్డి, గీతు రాయల్, నేహా చౌదరి ఈ వారం ఎలిమినేషన్ నామినేషన్ నుండి తప్పించుకున్నట్లు బిగ్ బాస్ ప్రకటించారు.

Bigg Boss Season 6 Day 2 Episode Review: ఇనయా సుల్తానా.. చాలా అభద్రతాభావానికి గురై తోటి ఇంటి సభ్యులపై
ఇంకా ట్రాష్ గ్రూప్ లో ఉన్న అభినయశ్రీ, బాలాదిత్యా, ఇనయా సుల్తానా..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ నామినేషన్ కి డైరెక్ట్ గా నామినేట్ అయ్యారు అని బిగ్ బాస్ తెలిపారు. ఇంతటితో..క్లాస్, ట్రాష్, మాస్ టాస్క్ కంప్లీట్ అయినట్లు స్పష్టం చేశారు. ఎవరు ఎలిమినేషన్ లో ఉన్నారు ఇంకా ఎవరు సేఫ్ అయ్యారు బిగ్ బాస్ ప్రకటించిన తర్వాత బాత్రూం వద్ద రోహిత్ ఇంకా మెరీనా మధ్య గొడవ జరిగింది. మెరీనా చెబుతుంటే రోహిత్ అద్దంలో చూసుకుంటూ ఉండటంతో ఇద్దరి మధ్య డిస్కషన్ కాస్త పెరిగి.. మాట మాట రావడం జరిగింది. రెండో రోజు చాలావరకు హౌస్ లో ఆట తీరు గమనిస్తే.. స్క్రీన్ స్పేస్ ఎక్కువగా అర్జున్ ఇంకా గీత రాయల్..ఇనయా సుల్తానా కి దక్కింది. రెండు టాస్కులలో ఓడిపోవడంతో ఇనయా సుల్తానా.. చాలా అభద్రతాభావానికి గురై తోటి ఇంటి సభ్యులపై కోపాన్ని చూపించేసింది. రోల్ బేబీ రోల్ టాస్క్ ఆడుతున్న సమయంలో ఆదిరెడ్డి తో కూడా సుల్తానా గొడవకు దిగింది. టాస్క్ అనంతరం నేహా విజేతగా ప్రకటించిన గాని ఆదిరెడ్డి పై సుల్తానా ఫ్రస్టేషన్ మొత్తం చూపించేసింది. ఇక రేవంత్.. ప్రారంభంలో క్లాస్ గ్రూప్ లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొనడంతో బాత్రూంలోకి వెళ్లి ఏడవటం.. కాస్త వెటకారంగా అనిపించింది. ఇది ఇలా ఉంటే రెండో రోజు ఆట చివరిలో.. శ్రీహాన్ గురించి ఆరోహి .. ఫ్రెండ్ అని చెప్పడంలో కాస్త గ్యాప్ తీసుకోవటంతో పక్కనే ఉన్న సూర్య కెమెరా వంక చూసి..సిరి.. పేరు చెప్పి సెటైర్లు వేయడం.. రెండో రోజు ఎపిసోడ్ మొత్తానికి హైలైట్ గా నిలిచింది.