బాలీవుడ్ లో ఫస్ట్ భారీ బడ్జెట్ చిత్రంగా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన సినిమా బ్రహ్మాస్త్ర. కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమాలో రణబీర్ కపూర్, అలియా భట్ హీరో హీరోయిన్స్ గా నటించారు. ఇక మౌనీ రాయ్ పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపిస్తుంది. కింగ్ నాగార్జున, అమితాబచ్చన్ కీలక పాత్రలలో కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమాపై బాలీవుడ్ మొత్తం భారీ అంచనాలు పెట్టుకుంది. ఈ సినిమాతో ఇండస్ట్రీ తలరాత మారిపోతుందని ఆశతో ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో సౌత్ బాషలతో పాటు హిందీలో రిలీజ్ అవుతుంది.
ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ ని చాలా గట్టిగా చేశారు. తెలుగులో కూడా గట్టిగానే ప్రమోట్ చేస్తున్నారు. ఏకంగా రాజమౌళి రంగంలోకి దిగి ఈ సినిమాని ప్రమోట్ చేసే బాద్యతని తీసుకున్నారు. ఇక తారక్ కూడా బ్రహ్మాస్త్ర ప్రమోషన్ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేసి సినిమా గురించి గొప్పగా చెప్పారు. ఇక రణబీర్ కపూర్, అలియా భట్ తెలుగు ప్రేక్షకులని మెప్పించడానికి ఏకంగా తెలుగులో మాట్లాడటంతో పాటు పాటలు కూడా పాడారు. ఇదిలా ఉంటే స్టార్ హీరోల చిత్రాలకి ఫస్ట్ రివ్యూ ఇచ్చే ఫేమస్ ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధూ తన రివ్యూని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇది ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సినిమాకు చేసిన భారీ పబ్లిసిటీతో ఓపెనింగ్ రోజున, వీకెండ్ లో వసూళ్లను రాబట్టొచ్చని, ఆ తర్వాత సినిమాకు కష్టాలు తప్పవని అన్నాడు.
మెరిసేదంతా బంగారం కాదని చెప్పాడు. ఫాంటసీ, అడ్వెంచర్ సినిమాలు బాలీవుడ్ లో చాలా తక్కువగా వస్తుంటాయని, ఇలాంటి సినిమాను తెరకెక్కించినందుకు అయాన్ ముఖర్జీని ప్రశంసించాల్సిందేనని ఉమైర్ సంధూ చెప్పాడు. అయితే, ఈ చిత్రంలో స్టోరీ, స్క్రీన్ ప్లే చాలా యావరేజ్ గా ఉన్నాయని తెలిపాడు. సినిమా కొన్ని చోట్ల గజిబిజీగా అనిపిస్తుందన్నాడు. రణబీర్ కపూర్ యాక్టింగ్ అంతగా మెప్పించలేదని, అలియా భట్ మాత్రం మెస్మరైజ్ చేసిందని ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే రిలీజ్ కి ముందే ఇలా సినిమాకి నెగిటివ్ పబ్లిసిటీ ఇవ్వడం కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే బాయ్ కట్ బాలీవుడ్ కాంపైన్ కి సపోర్ట్ చేస్తున్నవారు మాత్రం ఈ రివ్యూపై చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ దీనిని షేర్ చేస్తున్నారు.