
Gay Marriage : ప్రేమ పెళ్లైన , పెద్దలు చేసిన పెళ్లైన అమ్మాయి అబ్బాయి మధ్య జరగడం మన సంప్రదాయం . పాశ్చాత్య పోకడలతో ఈ మధ్య పెళ్ళితీరు , చేసుకునే వారి జోడు మారిపోతోంది. ఇద్దరు అబ్బాయిలు , కుదిరితే ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకునే రోజులు వచ్చేసాయి. ఈ పెళ్లిళ్లకు చట్ట బద్ధత కూడా రావడం తో సృష్టికి విరుద్ధంగా వివాహాలు జరిగిపోతున్నాయి. మా దేశం లో అడపా దడపా ఇలాంటి పెళ్లిళ్లు జరిగినా , విదేశాల్లో మాత్రం ఫుల్ లెన్త్ మస్తీ తో బంధుమిత్రుల సమక్షం లో వైభవంగా పెళ్లి చేసుకుంటారు. అక్కడ అది సర్వ సాధారణం . సెలబ్రిటీ లు కూడా వారి స్టేటస్ ని పక్కన పెట్టి మరి వారు ప్రేమించిన అమ్మాయి నో అబ్బాయినో వివాహమాడేస్తున్నారు. తాజాగా ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్లు సైమన్ పోర్టే జాక్వెమస్ , మార్కో మాస్త్రి వివాహ బంధం తో ఒక్కటయ్యారు . కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న సైమన్ పోర్టే జాక్వెమస్ , మార్కో మాస్త్రి స్టైలిస్ట్ ల గే వెడ్డింగ్ అంగరంగ వైభవంగా జరిగింది. పెద్దల సమక్షంలో ఒక్కటైనా ఈ జంట ఆనందం లో మునిగి తేలుతోంది.
Gay Marriage : 2018 నుంచి మార్కో తో డేటింగ్ చేస్తున్న సైమన్..
సైమన్ 2018 సంవత్సరం నుంచి మార్కో తో డేటింగ్ చేస్తున్నాడు . వీరిద్దరి డేటింగ్ పిక్స్ ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పుడు పోస్ట్ చేసినా తెగ వైరల్ అవుతుంటాయి. బీచ్ లలో , రిసార్ట్ లో, పూల్స్ లో వీరి హాలీడే పిక్స్ సెన్సేషన్ ను సృష్టిస్తాయి.

గత శనివారమే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దక్షిణాది ఫ్రాన్స్ చార్లెవల్ లో వీరి పెళ్లి వేడుక జరిగింది. పెళ్లి కోసం ఈ గే కపుల్ బ్లాక్ , ఐవరీ సుఇత్స్ వేసుకుని అదరగొట్టారు. ఇదుగోండి ఇక్కడ స్ట్రాప్ లెస్ గౌన్ వేసుకుని అందంగా కనిపిస్తున్న సైమన్ అమ్మమ్మ లిలిన్ సైమన్ ను పెళ్లి మండపానికి ఆనందంగా తీసుకువెళ్తోంది.
ప్రముఖ సింగర్ దువా లిపా వరుడి వివాహానికి తొడ ఎత్తు చీలికతో ఉన్న వైట్ డిజైనేర్ షీర్ డ్రెస్ ను వేసుకుని స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ అందమైన దుస్తులను జాక్వెమస్ డిజైన్ చేసారు . వీరితో పాటే ఏంటో మంది ప్రముఖులు పెళ్ళికి హాజరయ్యారు.