రామ్ పోతినేనికి జోడీగా నేను శైలజ అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది కీర్తి సురేష్. అందానికి అందం అంతకు మించిన అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందివచ్చిన క్రేజీ ఆఫర్లను అందిపుచ్చుకుని తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది ఈ అందాల భామ. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో మోస్ట్ బిజియెస్ట్ హీరోయిన్‌గా మారింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు కమర్షియల్ సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక క్రేజ్‌ను సంపాదించుకుంటోంది.

ఇప్పటి వరకు కీర్తి నటించిన ప్రతి సినిమాలోనూ ఎంతో సంప్రదాయంగా కనిపించింది. ఎక్కడా కూడా స్కిన్ షో చేసిన దాఖలాలు లేవు. స్టార్ హీరోల సరసన నటించినా ఈ అమ్మడు పద్ధతిగానే కనిపించింది . ఇప్పటివరకు గ్లామర్ షోకు నో చెబుతూ వస్తోంది. కేవలం నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను మాత్రమే ఎన్నుకుంటూ తన రూటే సపరేట్ అని నిరూపిస్తోంది ఈ భామ.
Keerthi Suresh : కీర్తీ సురేష్ కుర్రాళ్ల మతులు పోగొడుతోంది..
అయితే వెండితెరకే ఆ రూల్సా? బుల్లితెర మాటేమిటని కీర్తి అభిమానులు అంటున్నారు. సోషల్ మీడియాలో ఈ స్టార్ హీరోయిన్ చేసే హంగామా మామూలుగా ఉండదు. తన ఇన్‌స్టాగ్రామ్ వేధికగా హాట్ హాట్ ఫోటో షూట్ పిక్స్‌ను పోస్ట్ చేస్తూ కీర్తీ సురేష్ కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. తాజాగా మెటాలిక్ గ్రే గౌన్‌లో మెరిసిపోతూ అందరి చూపును తనవైపుకు తిప్పుకుంటోంది ఈ సుందరి. వెండితెరపై పద్ధతిగా కనిపించే కీర్తిలో ఇంత మార్పా అని నివ్వెరపోతున్నారు. పాము ఛర్మం ఒంటిపై కప్పినట్లు ఉండే సిల్వర్ అవుట్ ఫిట్‌లో కీర్తి అందాలు చూడతరమా అన్నట్లు ఉన్నాయి. డివీ మేకప్‌లో ఎలాంటి ఆభరణాలు ధరించకుండా సింపుల్‌గా కినిపిస్తూ.. హాట్ లుక్స్ అందరిని ఇంప్రెస్ చేస్తోంది.

Keerthi Suresh : మోడ్రన్ లుక్‌లో కనిపిస్తూ రూట్ మార్చిన కీర్తి…
ఇటీవలె ఈ చిన్నది క్లీవేజ్ షో చేసి యూత్‌కి చెమటలు పట్టేలా చేసింది. ప్యాంట్ సూట్ ధరించి మెడలో భారీ నెక్‌లెస్‌ను పెట్టుకుని తన అందాలు చూపించి చూపించకుండా చేసిని ఫోటో షూట్ పిక్స్ చూస్తూ పిచ్కెక్కాల్సిందే. ఇక స్లీవ్ లెస్ వైట్ గౌన్‌లో కీర్తి దిగిన ఫోటోలు నెట్టింటిని షేక్ చేసేసాయి. ఇప్పటి వరకు చీరకట్టులో సర్వాల్ కమీజ్‌లో తెలుగింటి అమ్మాయిగా కీర్తిని చూశారు అభిమానులు. ఇప్పుడు ఇలా మోడ్రన్ లుక్‌లో కనిపిస్తూ తన రూట్ మార్చి అందాలను ఆరబోస్తుండటంతో అందరూ అవాక్కవుతున్నారు. కీర్తికి ట్రెండీ లుక్స్‌కు ఫ్యాషన్ ప్రియులు ఫిదా అవుతున్నారు.