Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి పరిచయం అవసరం లేదు. బాలన్నట్టుగా ఇండస్ట్రీలోకి వచ్చిన మహేష్ బాబు అనంతరం హీరోగా ఎన్నో సినిమాలలో నటిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ పలు యాడ్స్ చేస్తూ కొన్ని ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్నారు. అదేవిధంగా జీ తెలుగు ఛానల్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఉన్నారు.
ఈ విధంగా జీ తెలుగు ఛానల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నటువంటి ఈయన ఈ చానల్లో ప్రసారమయ్యే కార్యక్రమాలు అన్నింటిని ప్రమోట్ చేయాల్సి ఉంటుంది ఈ క్రమంలోనే ఈ చానల్లో ప్రసారమవుతున్నటువంటి డాన్స్ ఇండియా డాన్స్ అనే కార్యక్రమంలో భాగంగా ఈయన సందడి చేశారు.ఇలా ఈ ఛానల్ లో ప్రసారమయ్యే కార్యక్రమాలన్నింటినీ ప్రచారం చేయడం కోసం జీ తెలుగు మహేష్ బాబుతో ఏకంగా తొమ్మిది కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్టు సమాచారం.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మహేష్ బాబు పెద్ద ఎత్తున డాన్స్ ఇండియా డాన్స్ షో లో తన కూతురు సితారతో కలిసి సందడి చేశారు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు సాధారణంగా ఇతర కార్యక్రమాలలో పెద్దగా బయటకు రారు కేవలం తన సినిమా పనులను పలు ఈవెంట్లలో పాల్గొంటారు.అయితే మహేష్ బాబు మొదటిసారి తన కూతురితో కలిసి బుల్లితెర కార్యక్రమంలో సందడి చేసినప్పటికీ ఈయనని పెద్దగా ఎవరు పట్టించుకోలేదని తెలుస్తోంది..
Mahesh Babu: డాన్స్ ఇండియా డాన్స్ కార్యక్రమం పై బిగ్ బాస్ ఎఫెక్ట్ పడిందా…
ఈ విధంగా మహేష్ బాబు బుల్లితెర కార్యక్రమం పై సందడి చేస్తున్న ప్రేక్షకులు పట్టించుకోకపోడానికి ఓ కారణం ఉంది.ప్రస్తుతం బుల్లితెరపై బిగ్ బాస్ రియాల్టీ షో ప్రసారమవుతుంది. అదేవిధంగా మరోవైపు క్రికెట్ మ్యాచ్ కూడా జరగడంతో మహేష్ బాబు డాన్స్ షో ను పెద్దగా పట్టించుకోవడంలేదని తెలుస్తోంది.మహేష్ బాబు కోసం జీ తెలుగు ఏకంగా తొమ్మిది కోట్లు ఖర్చుపెట్టిన జీ తెలుగు నష్టమేనా అంటూ పలువురు ఈ విషయంపై సందేహం వ్యక్తం చేస్తున్నారు.