Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం సమంత వరుస సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. అయితే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపించే సమంత ఈ మధ్యకాలంలో మాత్రం అంతగా యాక్టివ్ గా కనిపించడం లేదు. ఇంకా చెప్పాలి సోషల్ మీడియాలో కనిపించడమే మానేసింది. దీంతో సమంత ఎందుకు సోషల్ మీడియాలో టచ్ లో ఉండటం లేదు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇది ఒకటి అయితే సమంతలో సడన్ గా ఈ మార్పు ఏమిటి అన్న ప్రశ్న ప్రస్తుతం తెలుగు సినీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే మొదట ఏం మాయ చేసావే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సమంత ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. ఇకపోతే ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ కథా చిత్రాలో నటిస్తూ దూసుకుపోతోంది.
ఇక ఇది ఇలా ఉంటే సమంత టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకుని గత ఏడాది విడాకులు తీసుకుని విడిపోయిన విషయం తెలిసిందే. విడాకుల తరువాత సమంత కెరియర్ అంతంత మాత్రమే ఉంటుంది అని అందరూ భావించారు. కానీ విడాకుల తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా ఉంటూ దూసుకుపోతోంది. అంతేకాకుండా విడాకుల తర్వాత సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్లతో తన అందాలను ఆరబోస్తూ మరింత రెచ్చిపోతోంది.
ఇక తాజాగా సమంతకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే సమంత ఇకపై సినిమాలలో గ్లామరస్ గా నటించడం లేదని, సోషల్ మీడియాకు కూడా కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే హీరోలకు అత్యంత సన్నిహితంగా ఉండే సన్నివేశాలలో నటించకూడదని, దీంతో చిన్న చిన్న దుస్తులు ధరించేది లేదు అంటూ కొన్ని షరతులు విధించుకుందట.
కాగా తన వద్దకు కథలు చెప్పడానికి వచ్చే దర్శకులకు ఇటువంటి షరతులను విధిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక స్టార్ హీరోయిన్ సెంట్రిక్ కథ చిత్రాలకే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు స్పష్టంగా చెబుతున్నట్లు సినీ వర్గాలలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ వార్తలో నిజాలు తెలియాలి అంటే సమంత స్పందించే వరకు వేచి చూడాల్సిందే మరి.