Samantha : తెలుగు, తమిళ చిత్రాల్లో అగ్ర హీరోల సరసన హీరోయిన్‌గా నటించి ఎందరో అభిమానులను సొంతం చేసుకుంది సమంత. అంతేకాకుండా.. యూ టర్న్, ఓ బేబీ వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ నటించి సత్తా చాటింది. ఇక ముందు బాలీవుడ్‌లో సైతం సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. అయితే కెరీర్ ప్రారంభమై పీక్స్‌లో ఉన్న రోజుల్లో సమంత కొన్నాళ్లు చర్మ సమస్యతో సామ్ బాధపడిందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. దానికి సామ్ ట్రీట్‌మెంట్ తీసుకుంటే నయమైందనే న్యూస్ కూడా వినిపించింది. కానీ ఇలాంటి విషయాల్లో ఆమెను ఎవరు ప్రశ్నిస్తారు? కాబట్టి సమంతను ఎవరూ ప్రశ్నించలేదు. ఆమె కూడా సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి రాలేదు. అక్కడితో ఆ టాపిక్ ఎండ్ అయిపోయింది.
తాజాగా మళ్లీ ఇప్పుడు అలాంటి వార్తలే మళ్లీ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. సమంత కొన్నాళ్లుగా చర్మ సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతోందని, అందుకనే ఆమె బయటకు రావటం లేదని న్యూస్ వైరల్ అయ్యింది. అప్పుడంటే సైలెంట్‌గా ఊరుకున్నారు కానీ పదే పదే అవే వార్తలు రిపీట్ అయితే ఎలా? దీనిపై సమంత పర్సనల్ మేనేజర్ రియాక్ట్ అయ్యారు. కావాలనే సామ్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆమె ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించారు. తప్పుడు వార్తలను క్రియేట్ చేస్తున్న వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు.
Samantha : తప్పుడు వార్తలను క్రియేట్ చేసే వారిపై లీగల్ యాక్షన్..!
‘కొందరు కావాలనే సమంతపై తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు. ఆమెకు ఎలాంటి సమస్యా లేదు. ఆరోగ్యంగా ఉన్నారు. ఈ నెలలోనే షూటింగ్స్‌లోనూ పాల్గొనబోతున్నారు. సమంతపై తప్పుడు వార్తలను క్రియేట్ చేస్తున్న వారిపై లీగల్ యాక్షన్ తీసుకోవాలని సమంత ఆలోచిస్తుంది’ అని ఆయన తెలిపారు. కాగా.. ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత సమంతకు బాలీవుడ్ నుంచి ఆదరణ దక్కుతోంది. ప్రస్తుతం వరుణ్ ధావన్‌తో కలిసి ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తుంది. దీని కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటోంది. అలాగే ఆయుష్మాన్ ఖురానాతో కలిసి ఓ సినిమా చేయనుంది. దీని కోసం వర్క్ షాప్స్‌లో పాల్గొంటుంది. ఇవి కాకుండా సామ్ నటించిన పాన్ ఇండియా మూవీస్ శాకుంతంలం, యశోద చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.