Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు సెప్టెంబర్ 6వ తేదీ ఎపిసోడ్ లో జరిగిన హైలెట్స్ ఏంటో చూద్దాం.
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తున్నా నందుతో లాస్య ఏం చేయాలో సలహా ఇస్తుంది. అభి, తులసి తో నువ్వు డాడీ తో పరావర్తించే తీరు బాగాలేదు. అందరి ముందరా అవమానించే విధంగా మాట్లాడడం నాకు నచ్చలేదు అంటాడు. అందుకు అంకిత నువ్వు ఒకవైపు నుండి ఆలోచిస్తున్నావు ఆంటీ వైపు నుండి కూడా ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది అంటుంది. నేను మీ నాన్న ఇంటికి వెళ్లి బ్రతిమాలినపుడు నీకేమీ అనిపించలేదా అంటూ, మీ నాన్న మాజీ భర్త అన్న విషయం దాచి పెట్టమని చెప్పి తానే ఎందుకు చెప్పాడు వెళ్లి ప్రశ్నించు, అంటే అభి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.
తర్వాత సన్నివేశంలో బయటకు వెళ్తున్న ప్రేమ్ తో టిఫిన్ చేసి వెళ్ళమని తులసి అంటే అర్జెంటుగా వెళ్లాలి అంటూ ఉండగా ఇంతలో శృతి నేను చాలా బ్రతిమాలాను ఒంట్లో కొవ్వు ఎక్కువగా ఉంది అది కరగాలి కదా అంటూ వద్దన్నాడు, అంటే తులసి పాలు తెస్తానంటుంది. తర్వాత శృతి బైక్ లో గాలి తీసేసి ప్రేమ్ ను ఆటపట్టిస్తుంది. తర్వాత తులసి పాలు తీసుకొస్తే పాలు తీసుకొని ప్రేమ్ కు గాలి కొట్టమని ఆ పాలు తానే తాగుతూ సరదాగా ఇందులో పిన్ లేదు. రిపేరు చేయించాలి అంటూ అసలు విషయం చెబుతుంది.
తరువాత సన్నివేశంలో సామ్రాట్ ఎందుకు ఇంత డిస్టర్బ్ అవుతున్నాను అంటూ, ఇంపార్టెంట్ అన్ని మర్చిపోయి డిలే చేస్తున్నాను. తులసి విషయాన్ని ఎందుకు ఇంత సీరియస్ గా తీసుకుంటున్నాను. ఎలాగైనా ఈ విషయాన్ని మర్చిపోవాలి అనుకుంటూ ఉండగా ఇంతలో నందు, లాస్యలు క్యాబిన్ లోనికి వస్తారు. లాస్య, సామ్రాట్ తో తులసి తేలిగ్గా రాను అని చెప్పేసింది. సామ్రాట్ ఎందుకు రానంది ఆమె ప్రాబ్లం అప్పుడు లాస్య ఆ మాట వింటే నేను షాక్ అయిపోయాను. మీరు తులసిని ఫ్యామిలీ మెంబర్ల ట్రీట్ చేశారు.
ప్రాజెక్టు ఓకే చెప్పి తొందరగా అన్ని క్లియర్ చేసి కన్స్ట్రక్షన్ వరకు తీసుకొచ్చారు. నా సంగతి సరే కనీసం నందు ను కూడా దులిపి అవతల పారేసింది. పోయి మీ సామ్రాట్ గారికి చెప్పుకోండి అంది. పాపం నందు బాధను దిగమింగుకుంటున్నాడు. మీ దగ్గరికి రాను, మొఖం చూపించలేను అంటే నేనే బలవంతంగా తీసుకు వచ్చాను సార్, ఏం చూసుకొని ఇంత ధైర్యంగా మాట్లాడుతుందో అయినా మీరు తనకు ఏం నష్టం చేశారు. మావల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటే ఓపెన్ గా చెప్తే రిజైన్ చేసి వెళ్ళిపోతాం కదా సార్ ఇలా ప్రాజెక్టును మధ్యలో ఆపేయాల్సిన అవసరం ఉండదు అంటే దానికి సామ్రాట్ కోపంగా అవసరం లేదు. ఎవరికోసమో మీరు ఉద్యోగం మానుకోవాల్సిన అవసరం లేదు.
Intinti Gruhalakshmi:
ఆప్పుడు లాస్య ఆమె చదువుకోలేదు కదా సార్ ఆమె ఆలోచన విధానం అలాగే ఉంటుంది. అయినా ఒక సలహా ఇస్తాను. మీరు తప్పుగా అనుకోకపోతే ఒకసారి మీరే తులసి తో మాట్లాడితే వింటుందేమో అంటే ప్రాజెక్ట్ నేను క్యాన్సిల్ చేశానా, తను మనసు మార్చుకున్న నేను నా మనసు మార్చుకోలేను తను ఇంకా ఈ ఆఫీస్ లో అడుగు పెట్టాల్సిన అవసరం లేదంటూ మీ మాజీ భార్యకు చెప్పండి అని సీరియస్ గా చెప్తాడు సామ్రాట్. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.