హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ టబు. ఈ అమ్మడు సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా కొనసాగి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది. తెలుగులో ఆమె చివరిగా అల వైకుంఠపురంలో సినిమాలో తల్లి పాత్రలో నటించింది. అయితే ఆ సినిమాలో మంచి పవర్ ఫుల్ రోల్ చేసిన టబుకి పెద్దగా గుర్తింపు రాలేదని చెప్పాలి. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ మొత్తం త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కి వెళ్ళిపోయింది. దీంతో టబు ఈ సినిమాలో నటించింది అనే విషయం కూడా చాలా మందికి తెలియదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలీవుడ్ లో ఓ వైపు సినిమాలు, మరో వైపు వెబ్ సిరీస్ లు చేస్తూ టబు కెరియర్ పరంగా ఫుల్ బిజీగానే ఉంది.
ఇదిలా ఉంటే ఈ అమ్మడు ఇప్పటికి పెళ్లి చేసుకోకుండా ఉంది. దీనికి కారణం హీరోలతో నడిపిన ప్రేమ వ్యవహారాలే కారణం అనే టాక్ ఉంది. తెలుగు హీరో నాగార్జునతో ప్రేమ వ్యవహారం నడిపింది. తరువాత అజయ్ దేవగన్ తో కూడా టబు ప్రేమ వ్యవహారం నడిపించింది అనే రూమర్ బిటౌన్ లో ఉంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు పెళ్లి చేసుకోకపోవడానికి కారణాలు ఏమైనా కాని ఆమె మాటలు మాత్రం అప్పుడప్పుడు సంచలనంగా మారుతూ ఉంటాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో టబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చాలా మంది జీవితంలో పెళ్లి చేసుకొని, హ్యాపీగా పిల్లల్ని కనాలని అనుకుంటారు.
మీరు మాత్రం సింగిల్ గా ఉండిపోయారు ఎందుకని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడిగిన ప్రశ్నకి ఆమె చాలా విచిత్రంగా సమాధానం చెప్పింది. పిల్లల్ని కనాలంటే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది. పెళ్లి కాకుండానే పిల్లల్ని కనొచ్చు అని హాట్ కామెంట్స్ చేసింది. అలాగే పెళ్లి చేసుకోవాలంటే నచ్చేవాడు దొరకాలని, అంత వరకు వెయిట్ చేస్తానని, వయస్సు పెళ్లికి అడ్డుకాదని వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు టబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.