బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. ఇక హౌస్ లోకి 21 మంది కంటిస్టెంట్ లని కింగ్ నాగార్జున పంపించారు. వీరిలో కొంత మంది తెలిసిన ముఖాలు ఉన్నా చాలా మరికొంత మంది మాత్రం కొత్తవాళ్లు ఉన్నారు. ఇప్పుడిప్పుడే కెరియర్ స్టార్ట్ చేసి బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకోవాలని అనుకుంటున్నవారే కావడంవిశేషం. వారిలో రాజశేఖర్, అర్జున్ కళ్యాణ్, ఆరోహిరావు, ఇనయా సుల్తానా, శ్రీహాన్ లాంటివారు ఉన్నారు. వీరితో పాటు ఫేడ్ అవుట్ అయ్యి మళ్ళీ గ్రాండ్ గాతనని తనకు పరిచయం చేసుకోవాలని అనుకుంటున్న అభినయశ్రీ షోకిస్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. లావుగా ఉండే ఆమె చాలా స్లిమ్ అయ్యి సరికొత్త లుక్ లో దర్శనం ఇచ్చింది.
ఇక ఎంటర్టైన్మెంట్ పరంగా ఈ సారి ఎక్కువగా ఉండే అవకాశమే కనిపిస్తుంది. దీనికి కారణం ఫన్ కి కేరాఫ్ గా ఉన్న చలాకి చంటి, జబర్దస్త్ ఫైమా, ఆర్జే సూర్య, గలాటా గీతు లాంటి వారు ఉన్నారు. ఇక వీరితో కావాల్సినంత ఫన్ దొరికే అవకాశం ఉంటుందని అందరూ భావిస్తున్నారు. అలాగే గ్లామర్ షో చేయడానికి కూడా శ్రీసత్య, ఇనాయా సుల్తానా, అభినయశ్రీ, ఆరోహిరావు లాంటి బ్యూటీస్ బాగానే ఉన్నారు.మొత్తానికి బిగ్ బాస్ షోలో ఈ సారి అన్ని హంగులు ఉండే విధంగా నిర్వాహకులు బాగానే సెట్ చేశారు.
ఇక కపుల్స్ ని పంపించడం ద్వారా వారి పెర్సనల్ రొమాంటిక్ ఫెయిర్ గేమ్ ని కూడా టెలివిజన్ తెరపై చూడొచ్చు. ఇక ప్రతి సీజన్ లో కామన్ గా ఉండేది లవ్ డ్రామా. ఈ సారి అలాంటి డ్రామాకి తెరతీసే విధంగా కింగ్ నాగార్జున అర్జున్ కళ్యాణ్ తో చాక్లెట్ గేమ్ స్టార్ట్ చేశారు. ఇక అర్జున్ కళ్యాణ్ కూడా దానిని కొనసాగిస్తూ హౌస్ లోకి వెళ్లి చాక్లెట్ శ్రీసత్యకి ఇవ్వడం విశేషం. అర్జున్ కూడా శ్రీసత్యతో పులిహోర కలపడం స్టార్ట్ చేసినట్లే కనిపిస్తుంది. ఇలా బిగ్ బాస్ కొత్త పాత కలయికతో, ఎంటర్టైన్మెంట్, అందిస్తూ గేమ్ ని షురూ చేసే విధంగా మొదటి రోజు హౌస్ లోకి కంటిస్తేంట్ లని పంపించడం జరిగింది.