Bigg Boss Season 6: తెలుగు బిగ్ బాస్ హౌస్ లో తెలుగు లేడీ యాంకర్లు బాగా రాణించిన సందర్భాలు కోకోలలు. యాంకరింగ్ రంగానికి చెందిన చాలామంది లేడీ కంటెస్టెంట్లు గత తెలుగు బిగ్ బాస్ సీజన్ లలో తమదైన శైలిలో రాణించారు. అయితే సీజన్ సిక్స్ ఆదివారం సాయంత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్ లో గతంలో ఎన్నడూ లేని రీతిలో… ఏకంగా 21 మంది సభ్యులను హౌస్ లోకి పంపించడం సంచలనం రేపింది. ఎందుకు అనుగుణంగానే హౌస్ కూడా చాలా పెద్దదిగా ఉండటంతో.. మొదటివారం స్క్రీన్ స్పేస్ కోసం భారీగానే హౌస్ లో గొడవలు పెట్టే దిశగా బిగ్ బాస్ రెడీ అవుతున్నట్లు అర్థమవుతుంది.
ఇప్పటికే హౌస్ లోకి వెళ్ళిన కంటెస్టెంట్లు ఎవరికి వారు తమ స్ట్రాటజీ లతో ఇంకా… గేమ్ ప్లానింగ్ లతో మొదలెట్టేశారు. కొంతమంది సైలెంట్ గా ఉంటే మరి కొంతమంది… అందరితో కలిసి పోతూ.. ఉన్నారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్ లో 20వ కంటెస్టెంట్ గా లేడీ యాంకర్ అరోహి రావ్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాకు చెందిన అరోహి రావ్.. అలియాస్ అంజలి చిన్నతనం నుండే కుటుంబ పరంగా ఎన్నో కష్టాలను ఎదురుకోవడం జరిగింది. వేదికపై ఇదే విషయాలను అరోహి తెలియజేసింది. ఎన్నో కష్టాలతో పెరిగి సాయం చేస్తూనంటునే… నాకేమిస్తావ్ అన్న తరహాలో వెక్కిలి చూపులు చూసినట్లు ఆవేదన వ్యక్తం చేసింది.

Bigg Boss Season 6: చిన్నతనంలో ఆరోహి కష్టాలు..
చిన్న వయసులోనే అనారోగ్యంతో తల్లి చనిపోగా ఆ తర్వాత తండ్రి మరో మహిళను పెళ్లి చేసుకుని అర్ధాంతరంగా వదిలేసినట్లు అరోహి రావ్ తన చిన్నతనం కష్టాలను తెలియజేసింది. ఈ క్రమంలో చిన్న వయసులో అమ్మమ్మ దగ్గర పెరిగినట్లు తెలిపింది. అనంతరం యాంకర్ గా కెరియర్ మొదలుపెట్టి ఇంకా షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ రాణించినట్లు స్పష్టం చేసింది. టీవీ9లో ఇస్మార్ట్ న్యూస్ తో.. మంచి పాపులారిటీ సంపాదించిన అరోహి రావ్… సీజన్ సిక్స్ బిగ్ బాస్ హౌస్ లో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.