Biggboss 6 : బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్‌బాస్ సీజన్-6 సిద్ధమైంది. ఇప్పటికే ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఆరో సీజన్‌ను అంగరంగ వైభవంగా ప్రారంభించింది. సీజన్-3 నుంచి హోస్ట్‌గా వ్యవహరించిన నాగార్జుననే ఈ సీజన్‌కు కూడా హోస్ట్‌గా వినోదం పంచుతున్నారు. ఈ క్రమంలోనే నాగ్ వైట్ అండ్ వైట్‌లో ఎంట్రీ ఇచ్చారు. కొత్త కంటెస్టెంట్‌లకు స్వాగతం పలికేందుకు హౌస్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇప్పటి వరకూ జరిగిన ఐదు సీజన్లతో పాటు ఓటీటీలో వచ్చిన సీజన్ కంటే భిన్నంగా హౌస్‌ను నిర్వాహకులు అరేంజ్ చేశారు.
‘‘గెలుపు ఆట మీద ఆసక్తి ఉన్నవాడిని కాదు..ఆటలో ఆశయం ఉన్నవాడిని మాత్రమే గెలిపిస్తుంది. స్నేహాల మధ్య కాస్త పలకరింపులు, పులకరించిపోయే ప్రేమలుంటాయి. స్నేహాలు, ప్రేమలు ఎన్నున్నా.. గెలవాల్సిన చోట నిలబడాల్సినప్పుడు యుద్ధాలు ఉంటాయి. ఓదార్పు దూరమై.. ఒంటరితనం దగ్గరైనప్పుడు ఒడికి చేరిన కన్నీళ్లూ ఉంటాయి. ఎన్ని ఉన్నా ఈ యుద్ధంలో ఆత్మ విశ్వాసమే ఆయుధమైనప్పుడు ప్రశ్నించడానికి, ప్రశంసించడానికి, సమర్ధించడానికి, శాసించడానికి, గెలుపుకి తోడుగా.. ఓటమికి ధైర్యంగా, అందరికీ అండగా.. రాజ్యాన్ని గెలిచే రాజు ఒక్కడుంటాడు. ఇక మొదలెడదామా?’ అనే ఏవీతో నాగ్ ఎంట్రీ అదిరిపోయింది.
Biggboss 6 : ఈ ఫీల్డ్‌లో కొత్తగా ఏదైనా ట్రై చేయాలంటే నేనేరా..
‘ఈ ఫీల్డ్‌లో కొత్తగా ఏదైనా ట్రై చేయాలంటే నేనేరా..’ అంటూ నాగ్ చెప్పే మాటలు ఆకట్టుకున్నారు. బంగార్రాజు సాంగ్‌తో నాగ్ ఎంట్రీ హైలైట్‌గా నిలిచింది. నాగ్ డ్యాన్స్ మరో హైలైట్. మనకి రుచులు.. రుతువులు ఆరు.. ఈ బిగ్‌బాస్ 6.. అంటూ నాగ్ చెప్పే మాటలు ఆకట్టుకున్నాయి. ఓ సాంగ్ వేసుకుంటూ వెళ్లి మరీ నాగ్ హౌస్‌ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈసారి హౌస్ అదిరిపోయింది. ఈ సాంగ్‌ను నాగార్జునే పాడటం విశేషం. మొత్తానికి అంగరంగ వైభవంగా బిగ్‌బాస్ ప్రారంభమై పోయింది.