Viral Video: ఒకప్పుడు పెళ్లైన మహిళ ఎంతో చూడచక్కగా చీర కట్టుకొని నుదుటిన బొట్టు మెడలో నల్లపూసలు చేతినిండా గాజులు జడలో పువ్వులు పెట్టుకొని చూడగానే మహాలక్ష్మిలా ఉండేది. అయితే రాను రాను ప్రతి ఒక్కరి వస్త్ర ధారణలో ఎన్నో మార్పులు వచ్చాయి. పెళ్లయిన మహిళలు సైతం 24 గంటలు నైటీలు వేసుకొని ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం. ఇలా పెళ్లి తర్వాత ఇంటిపట్టున ఉండే మహిళలు ఉదయం,రాత్రి అనే తేడా లేకుండా నైటీలు వేసుకొని కనిపిస్తుంటారు. అయితే మహిళలు నైటీలు వేసుకోవడం గురించి ఓ వ్యక్తి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే ఆ వ్యక్తి మహిళలు నైటీల గురించి మాట్లాడుతూ ఓ పురుషుడు వివాహానికి ముందు ఒక అమ్మాయిని చీరలో చూసి తన అందాన్ని, తన హావ భావాలను చూసి ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. అయితే పెళ్లయిన తర్వాత తను ఎప్పుడు చూడు నైటీలోనే కనిపిస్తుంది. అన్నం చేసిన చేయి తుడుచుకోవడానికి నైటీనే,ముక్కు తడుచుకోవడానికి నైటీని ఇలా నిత్యం నైటీలో కనపడుతూ ఉంటుంది. అయితే ఏదో ఒక ఫంక్షన్ కోసం బయటకు వెళ్లిన ఆ మగవాడు వేరొక స్త్రీని చూసి నా భార్య కూడా ఇలా అందంగా తయారైతే ఎంత బాగుంటుందో అని మనసులో అనుకుంటాడు.
Viral Video: పరాయి స్త్రీలపై ఆలోచన పడుతుంది…
ఈ విధంగా ప్రతిరోజు మిమ్మల్ని నైటీలో చూసి మీ ఆయన దృష్టి ఇతర స్త్రీలపై పడింది అంటే మీరుజీవితంలో ఫెయిల్ అయినట్టే ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి అంటూ ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీరు ఎవరి కోసం రెడీ అవుతున్నట్టు. పెళ్లికి ముందు మీ అందం మీ మనసు, మీ హావభావాలను చూసి పెళ్లి చేసుకున్న ఆయనకు ఇలా తరచూ నైటీలలో కనిపించడం వల్ల ఆయన దృష్టి ఇతరులపై తప్పకుండా పడుతుంది. ఆయన మిమ్మల్ని ఏం చూసి చేసుకున్నారు పెళ్లి తర్వాత మీరు అలా కనపడకపోతే తప్పకుండా వాళ్ళ దృష్టి ఇతరులపై పడుతుందనీ ఈయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన పలువురు నిజమే కదా అని భావిస్తున్నారు.
https://youtube.com/shorts/LyCb3rv2qPw?feature=share