దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ కాంబినేషన్ లో హను రాఘవపూడి దర్శకత్వంలో, వైజయంతీ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కి సూపర్ హిట్ అయిన చిత్రం సీతారామం. 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 90 కోట్ల కలెక్షన్స్ ని ఇప్పటి వరకు కలెక్ట్ చేసిన డబల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో దుల్కర్, మృణాల్ నటనకి ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. ఇక సెప్టెంబర్ 2న ఈ సినిమా హిందీలో కూడా రిలీజ్ అయ్యి అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది.
రెండు రోజుల్లో ఏకంగా 5 కోట్ల వరకు ఈ సినిమా కలెక్ట్ చేసింది. అక్కడ హిట్ టాక్ రావడంతో వీకెండ్ లో ముంబై, ఢిల్లీ లాంటి నగరాల్లో థియేటర్స్ హౌస్ ఫుల్ అయిపోయాయి. ఇక సౌత్ లో రిలీజ్ అయ్యి 25 రోజులు గడుతున్న ఇప్పటికి మంచి కలెక్షన్స్ రాబడుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి మరో సర్ప్రైజ్ న్యూస్ బయటకి వచ్చింది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ. అవుతుంది. సెప్టెంబర్ 8న ఈ మూవీ వరల్డ్ ప్రీమియంగా టెలికాస్ట్ కావడానికి రెడీ అవుతుంది.
అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాని భారీ ధర పెట్టి రైట్స్ ని కొనుగోలు చేసింది. ఈ నేపధ్యంలో ఇప్పటికే థియేటర్ కలెక్షన్స్ మేగ్జిమం వచ్చేసాయి. ఇక హిందీలో కూడా కలెక్షన్స్ బాగానే వస్తున్న కూడా అక్కడ సెప్టెంబర్ 9న బ్రహ్మాస్త్ర రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ నేపధ్యంలో మేగ్జిమం థియేటర్స్ ని ఆ సినిమా ఆక్యుపై చేసేస్తుంది. ఈ నేపధ్యంలో సీతారామం సినిమా ఒటీటీ ప్రేక్షకుల కోసం అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. డిజిటల్ లో కూడా ఈ సినిమాకి మంచి స్పందన వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.