కార్తీక్‌కి ఎలాగైనా గతం గుర్తొచ్చేలా చేయాలని ఫిక్స్ అయిన దీప.. మోనిత ఇంటికి దగ్గర ఉంటే ఓ ఇంటిని మారుతుంది. అక్కడే ఓ బిర్యానీ పాయింట్ స్టార్ట్ చేసి వంటలక్క పాత్రలోకి వెళ్లిపోతుంది. అప్పుడే బయటికి వెళ్లి ఇంటికి వచ్చిన కార్తీక్.. ఆమె చేసిన బిర్యానీ వాసన వస్తుంది. దాంతో మోనిత దగ్గరకి వెళ్లి ఆ వంట చేసిన ఆవిడనే వంటమనిషిగా తీసుకొద్దామంటాడు. సరేనని ఇద్దరూ కలిసి అక్కడికి వెళతారు. అక్కడ దీప ఉండడం చూసి మోనిత షాక్ అవుతుంది. అనంతరం.. వంట మనిషిగా రమ్మని దీపని కార్తీక్ అడుగుతాడు. రానని చెప్పిన దీప.. చెబితే వంట చేసి పంపిస్తానని అంటుంది. అనంతరం మోనితకి దీపకి మధ్యలో ఎప్పటిలాగే మాటల యుద్ధం నడుస్తుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 3న ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
దీపతో మాట్లాడిన తర్వాత ఇంటికి వెళతాడు కార్తీక్. అన్నింటిని గురించి మర్చిపోయే కార్తీక్ దీప చెప్పిన మాటలను మాత్రం గుర్తుంచుకుంటాడు. అందుకే ఇంటికి వెళ్లిన తర్వాత కూడా దీప చెప్పిన మాటల గురించే ఆలోచిస్తుంటాడు. ‘హిమ, సౌర్య, సౌందర్య ఈ పేర్లు ఎక్కడో విన్నట్లు ఉందే.. వాళ్లు వంటలక్క, అమ్మ, కోడలా అని పిలిస్తే నన్ను మాత్రం దీప అని పిలవమని చెప్పింది. రేపు కనిపిస్తే సరిగ్గా పిలుస్తానో లేదో చూద్దాం’ అని అనుకుంటాడు కార్తీక్. మరోవైపు.. ఆటో నడపడానికి వెళ్లిన వారణాసి, సౌర్య ఇంటికి వచ్చేస్తారు. అయినా ఎక్కడ అమ్మనాన్న కనిపించలేదని బాధ పడుతుంది సౌర్య. ఇక్కడ లేరోమోనమ్మా అని అంటాడు వారణాసి. అక్కడే ఉండే అవకాశం ఉందని చెప్పిన సౌర్య.. వారిద్దరి ఫొటోలు ఊర్లో అతికిద్దామంటుంది. ఒకేనంటాడు వారణాసి.
ఇక మోనిత మాత్రం కార్తీక్, దీపకి మధ్య జరిగిన సంభాషణ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ‘కార్తీక్‌ని సొంతం చేసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాను.. ఈ దీప శనిలా దాపురించిందేంటి. ఏకంగా ఇంటి ముందే తిష్ట వేసింది. దాన్ని ఏలాగైనా ఇక్కడి నుంచి పోయేలా చేయి’ అని దేవుడిని వేడుకుంటుంది మోనిత. దానికి రివర్స్‌లో.. అప్పుడే ‘డాక్టర్ బాబు’ అంటూ పిలుస్తూ బిర్యానీ తీసుకొని ఇంట్లోకి వస్తుంది దీప. ఆమె మాటలు విని కార్తీక్ బయటికి వచ్చి బిర్యానీ తెచ్చావా అని అడుగుతాడు. ఇంతలో మోనిత కూడా మెడ మీద నుంచి కిందకి దిగి వస్తుంది. దాంతో.. దీప కావాలనే కార్తీక్‌ని డాక్టర్ బాబు అని, మోనితాని డాక్టరమ్మా అని పిలుస్తుంది. అది విని మోనితకి అరికాలి మంట నెత్తికెక్కుతుంది. దాంతో అలా పిలవకు అని గట్టిగా అరుస్తుంది. ఎందుకు అలా అరుస్తావని మోనితపై కోప్పడతాడు కార్తీక్. అనంతరం మోనితకి చేయి కాలింది కదా అని చెప్పి తనే స్వయంగా కార్తీక్‌కి బిర్యానీ వడ్డిస్తుంది. అది తిన్న కార్తీక్ రోజు ఈ బిర్యానీనే తినాలని అనిపించేంతా బావుందని పొగుడుతాడు కార్తీక్.
కార్తీక్ తినేసి తన రూమ్‌కి వెళ్లిపోతాడు. దాంతో.. ‘వినావు కదా మోనిత. రోజు కావాలంటున్నారు. ఆ రోజు త్వరలోనే వస్తుంది’ అని కూల్‌గా అంటుంది దీప. అది విని అది జరగదని, తన ఇచ్చే మందుల ప్రభావం అలాంటిదని అంటుంది మోనిత. ‘చూద్దాం నీ మందులు గెలుస్తాయో.. నా ప్రేమ గెలుస్తుందో.. నాతో మాట్లాడుతున్నప్పుడు ఆయన కొత్త ఉత్సాహం రావడం చూశావు కదా. త్వరలో అని గుర్తు చేద్దాం’ అని వెటకారంగా అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది దీప. మరోవైపు.. ఎక్కడికో వెళ్లి ఇంటికి వస్తారు వారణాసి, సౌర్య. దాంతో చంద్రమ్మ చేసి పెట్టిన బిర్యానీ పెట్టుకొని తింటూ ఉంటారు. దాంతో.. సౌర్యకి దీప చేసిన బిర్యానీ గుర్తొచ్చి బాధపడుతుంది. వారణాసి ఏం జరిగిందని అడగడంతో.. దీప బిర్యానీ చేయడం కార్తీక్ లొట్టలేసుకుంటూ తినడం గురించి చెబుతుంది. దాంతో.. అక్క బిర్యానీ మీ అందరినీ కలుపుతుందని భరోసాగా మాట్లాడతాడు వారణాసి.
మరోవైపు.. డాక్టర్ అన్నయ్య ఇంటికి వెళుతుంది దీప. జరిగిన విషయం అంతా పూసగుచ్చినట్లు చెబుతుంది. ‘తాను అలా వెళతానని మోనిత ఊహించి ఉండదు. నా వంట వాసన చూసి వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు. అది చూసి నాకు నమ్మకం వచ్చేసిందమ్మా’ అని సంతోషంగా చెబుతుంది. ‘ఇంతకుముందు ఇప్పటికీ కార్తీక్‌లో ఏమైనా తేడా వచ్చిందా.. నిన్ను గుర్తు పడుతున్నాడా’ అని అడుగుతాడు డాక్టర్. లేదని దీప చెప్పడంతో.. ‘ఇప్పుడే ఇలా ఉందంటే.. ఒకవేళ వారిద్దరికీ పిల్లలు పుడితే పరిస్థితి ఏంటి. పెద్ద సమస్య అవుతుంది’ అనుమానపడతాడు డాక్టర్. ఆయన తల్లికూడా అది జరిగే అవకాశం ఉందని కొడుకునే సమర్థిస్తుంది. అది దీపలో కొత్త అనుమానాలకు దారి తీస్తుంది.
ఇంతలో చీకటి పడుతుంది. ఎక్కడికో వెళ్లిన వారణాసి ఇంటికి వస్తాడు. దాంతో పరుగెత్తుకు వెళ్లి.. ఫొటోలు ఉన్న అతని పాత ఫోన్‌ని రిపేరు చేయించావా అని అడుగుతుంది. అది పూర్తిగా పాడైపోయిందని.. ఆనందరావుకి ఫొన్ చేసి ఫొటోలు పంపమని అడుగుతానని అంటాడు వారణాసి. దాంతో.. ‘అదేం వద్దు.. అలా చేస్తే వాళ్లకి నేను ఇక్కడ ఉన్నానని తెలిసిపోతుంది. అలాగే మళ్లీ వచ్చి ఇబ్బంది పెడతారు. అమ్మనాన్న దొరికిన తర్వాతే ఇంటికి వెళతాను. అప్పుడే హిమ మీద కూడా కోపం పోతుంది’ అని కోపంగా అనేసి ఇంట్లోకి వెళ్లిపోతుంది. ఇక తెల్లారగానే.. వంటకి అవసరమైనా సమన్లు తీసుకుని వస్తుంది దీప. ఇంట్లోకి వచ్చి కార్తీక్ గురించే ఆలోచిస్తూ.. బతకడం కోసం చేసిన వంటని, కార్తీక్ కోసం చేయాల్సి వస్తోంది. ఫలితం ఉంటుందా లేదా అని ఆలోచిస్తుంటుంది దీప. దాంతో ఈ ఎపిసోడ్‌కి శుభం కార్డు పడుతుంది. తరువాయి భాగం అంటూ.. దీప చేసిన వంట తిని వాంతులు చేసుకుంటుంది మోనిత. టెస్టు చేసిన వేరే డాక్టర్ ఫుడ్ పాయిజన్ అయ్యిందని చెబుతాడు. దాంతో కోపంతో ఊగిపోతూ దీప వద్దకు వెళ్లి.. ‘నా భార్యకు విషం పెడతావా.. వేరే మహిళ భర్త మీద ఆశపడడం మంచిది కాదు’ అని హెచ్చరిస్తాడు. అసలు ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.