కొన్ని సినిమాలు రిలీజ్ మొదటి రోజు డివైడ్ టాక్ తో స్టార్ట్ అవుతాయి. డిజాస్టర్ సినిమా అని కూడా తేల్చేస్తారు. ఇక నిర్మాతలు, బయ్యర్లు అందరూ కూడా నష్టపోయామని ఫిక్స్ అయిపోతారు. అయితే ఊహించని విధంగా మళ్ళీ మౌత్ టాక్ తో ఆ సినిమాలు పుంజుకొని బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలుస్తూ నిర్మాతలకి కాసుల వర్షం కురిపిస్తూ ఉంటాయి. అందుకే దర్శకులు, నిర్మాతలు ఆడియన్స్ పల్స్ ఎలా ఉంటుందో చెప్పలేమని చాలా సందర్భాలలో చెబుతూ ఉంటారు. ఆడియన్స్ కి ఒక సినిమా ఎందుకు నచ్చింది అంటే వాడి దగ్గర చాలా కారణాలు ఉంటాయి. అలాగే ఒక సినిమా ఎందుకు పోయింది అనడానికి కూడా కారణాలు ఉంటాయి. కానీ ఆడియన్స్ నచ్చే ఎలిమెంట్స్ తో తీసిన ఏదో ఒక సందర్భంగా ఆడియన్స్ డిజప్పాయింట్ అయ్యి సినిమా ఫలితం ఫ్లాప్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అలాంటి వాటిలో రిపబ్లిక్, కొండపొలం లాంటి సినిమాలు ఈ మధ్యకాలంలోనివి చేరుతాయి. గతంలో అయితే చాలా సినిమాలు ఉన్నాయి. అలాగే ఫస్ట్ డే నెగిటివ్ టాక్ తో స్టార్ట్ అయ్యి సూపర్ హిట్ అయిన సినిమాల జాబితాలో పోకిరి సినిమా ఉంటుంది. దాని తర్వాత చెప్పుకోవాల్సింది నువ్వు నాకు నచ్చావ్. వెంకటేష్ హీరోగా, కె విజయ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్ లోనే నిర్మించారు. 2001లో ఈ మూవీ రిలీజ్ అయ్యింది. కరెక్ట్ గా 64 రోజులలో సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. మూడు గంటలకి పైగా సినిమా నిడివి ఉంది. తగ్గిస్తే బాగుంటుందని అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేసిన నిర్మాతలు మాత్రం వద్దని చెప్పేసారు.
థియేటర్స్ లో రిలీజ్ అయిన మొదటి రోజు సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది. కనీసం మూడు వారాలు కూడా ఆడటం కష్టం అని తేల్చేశారు. అయితే ఊహించని విధంగా రెండు రోజుల తర్వాత రిజల్ట్ పూర్తిగా మారిపోయింది. సినిమాలో ఫన్, డైలాగ్స్, వెంకటేష్, ఆర్తి అగర్వాల్ రొమాంటిక్ డ్రామా ఆడియన్స్ కి బాగా నచ్చింది. సినిమాలో ప్రకాష్ రాజ్ చదివే నాన్న కవిత థియేటర్స్ లో ఫుల్ ఫన్ క్రియేట్ చేసింది. దీంతో లాంగ్ రన్ లో సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఇక రైటర్ గా త్రివిక్రమ్ కి ఈ సినిమా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇక అతని కెరియర్ లో వెనక్కితిరిగి చూసుకునే అవకాశం లేకుండా చేసింది. వెంకటేష్ కెరియర్ లో కూడా బెస్ట్ క్లాసిక్ మూవీగా నువ్వు నాకు నచ్చావ్ నిలిచింది. ఇక ఆర్తిఅగర్వాల్ కి కూడా స్టార్ హీరోయిన్ గా అవకాశాలు తెచ్చి పెట్టింది.