పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జల్సా సినిమా ఎంత పెద్ద సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఫ్లాప్ ల పరంపరంని కంట్రోల్ చేసింది. త్రివిక్రమ్ మానియా, పవన్ కళ్యాణ్ ఫేమ్ సినిమాకి సూపర్ హిట్ తీసుకొచ్చాయి. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా సినిమా సక్సెస్ లో ఒక కారణం అని చెప్పాలి. అయితే ఈ సినిమా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా 4కే విజువల్స్ తో మళ్ళీ జల్సా మూవీని థియేటర్స్ లో ఫ్యాన్స్ షోలు గా రీరిలీజ్ చేశారు. ఈ రీ రిలీజ్ సరికొత్త రికార్డ్ ని ఈ మూవీ క్రియేట్ చేసింది. దేశ వ్యాప్తంగా 700 స్క్రీన్స్ లో సినిమా రిలీజ్ అయ్యింది.
ఇక ఈ షోలకి భారీ స్పందన వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ విపరీతంగా సినిమాని చూడటానికి తరలి వచ్చారు. ఇక ఈ సినిమా ద్వారా రెండు కోట్లకి పైగా ఒక్క ఆటతోనే గ్రాస్ కలెక్ట్ చేసింది. ఓ విధంగా చెప్పాలంటే ఈ గ్రాస్ ఒక రీరిలీజ్ సినిమా హిస్టరీలోనే ఎక్కువ అని చెప్పాలి. ఇక ఈ కలెక్షన్ పవన్ కళ్యాణ్ స్టామినాని పరిచయం చేసింది. ఇదిలా ఉంటే ఈ జల్సా రీరిలీజ్ సందర్భంగా పవర్ స్టార్ అత్యుత్సాహం కారణంగా చాలా థియేటర్స్ ని డ్యామేజ్ అయ్యాయి. కొన్ని థియేటర్స్ లో సినిమా రిలీజ్ చేయలేదని ధ్వంసం చేశారు. విశాఖ లీలామహల్ థియేటర్ ని అయితే పూర్తిగా నాశనం చేసేశారు.
ఇక కొన్ని థియేటర్స్ లో అయితే స్క్రీన్ ని నాశనం చేశారు. పవన్ ఫాన్స్ ప్రత్యేకంగా ఈ షోలు వేసుకోవడంతో హ్యాండిల్ సినిమాకి వచ్చే ఫ్యాన్స్ ఉత్సాహాన్ని కంట్రోల్ చేయలేకపోయారు. దీంతో చాలా థియేటర్స్ లో స్క్రీన్స్ ని నాశనం చేశారు. ఒక్క నైజాంలోనే 12 స్క్రీన్స్ పూర్తిగా దెబ్బతిన్నాయని తెలుస్తుంది. ఒకో స్క్రీన్ కి 12 లక్షలు అవుతుంది. ఈ లెక్కన ఏపీ, నైజాం మొత్తం కలుపుకుంటే జల్సా రీరిలీజ్ కారణంగా థియేటర్స్ యజమానులుకి వచ్చిన లాభం కంటే నష్టం ఎక్కువ అనే మాట వినిపిస్తుంది. ఇక సినిమా చూసిన వారు ఎవరికి వారు తమ ఇళ్ళకి వెళ్లిపోయారు. మళ్ళీ ఆ థియేటర్స్ ని పునరుద్ధరించుకోవాల్సిందే ఓనర్స్ మాత్రమే. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై థియేటర్ ఓనర్స్ చాలా కోపంగా ఉన్నట్లు తెలుస్తుంది.