దేవికి తండ్రిగా నట్టిస్తున్న తాగుబోతు అసలు బండారం బయట పెడతాడు ఆదిత్య. వాడిని నాలుగు తన్ని నిజమేంటో దేవికి తెలిసేలా చేస్తాడు. దాంతో దేవి మళ్లీ.. మా నాన్న ఎవరు మరీ అని అడుగుతుంది. ఆదిత్య తనే అసలు తండ్రినని చెప్తుండగానే దేవి కళ్లు తిరిగి పడిపోతుంది. ఆ తర్వాత ఆగస్టు 2 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం..
దేవి దగ్గర నిజం దాచిపెడుతున్నందుకు బాధపడుతుంటుంది రాధ. దేవి ఇంటికి రావడం చూసి షాక్ అవుతాడు మాధవ్. ఏం జరిగిందో తెలుసుకునేందుకు వెంటనే ఆ తాగుబోతుకు ఫోన్ చేస్తాడు. కానీ వాడు ఫోన్ లిఫ్ట్ చేయడు. తర్వాత సీన్‌లో ఆ తాగుబోతు తప్పించుకుని పరుగెత్తుతాడు. మరోవైపు చిన్మయి.. చెల్లెలుకు ఏమైందని, ఎందుకు అలా ఉంటుందని తల్లిని ప్రశ్నిస్తుంది. రెండు రోజుల్లో దేవమ్మ సక్కగ అవుతదని బాధపడకని ఓదారుస్తుంది రాధ.
అక్కడ ఆదిత్య దేవికి నిజం చెప్పలేకపోయినందుకు బాధపడతాడు. నిజం చెప్తే దేవి ఊరుకుంటుందా? తనకి ఇన్ని రోజులు ఎందుకు దూరంగా ఉన్నావని అడిగితే ఏం చెప్పాలో అని ఆలోచిస్తుంటాడు. ‘దేవీ నీకు నిజం చెప్పలేకపోవచ్చు కానీ నిజమేంటో నాకు తెలుసు. నాన్నా అని పిలిపించుకోలేక పోవచ్చు కానీ నాన్నగా నీకు చేయాల్సింది చేస్తా’ అని దేవిని ఉద్దేశించి మనసులో అనుకుంటాడు ఆదిత్య.
మరుసటి రోజు ఉదయం దేవి ‘ఎందుకు నాయనా.. నాకు అబద్ధం చెప్పినవ్’ అని నిలదీస్తుంది. ఛ.. ఛ నీకు నేనెందుకు అబద్ధం చెప్తానమ్మా.. వాడి చేతిలో మీ అమ్మ ఫోటో, నీ ఫొటో చూసి నిజమేనని నమ్మినా.. అని నమ్మిస్తాడు మాధవ్. మరి తన తండ్రెవరిని దేవి మళ్లీ అడగ్గా.. నేను ఈసారి నిజంగానే వెతికిపెడతానని మాటిస్తాడు. అది చూసి రాధ కోపంగా వచ్చి.. సమయం వచ్చినపుడు నేనే చెప్తానని అంటుంది దేవితో. రాధ మాట దేవి నమ్మకపోవడంతో తన మీద ప్రమాణం చేసి ఈ సారి కచ్చితంగా చెప్తానని హామీ ఇస్తుంది. అయినా దేవి నమ్మదు. తన తండ్రెవరో తనే తెలుసుకుంటానని చెప్పి బాధగా వెళ్లిపోతుంది.
సీన్ కట్ చేస్తే.. ఆదిత్యను అమెరికా పంపించేందుకు ఒప్పిస్తుంది దేవుడమ్మ. ఆఫీసులో పనులయ్యాక వెళ్తానమ్మా అని అంటాడు ఆదిత్య. అయినా దేవుడమ్మ బలవంతం చేయడంతో ఆదిత్య కోప్పడతాడు. అప్పుడు సత్య కూడా భర్తని నిలదీస్తుంది. భర్తగా తన బాధను తీర్చాల్సిన బాధ్యత నీకు లేదా అని ప్రశ్నిస్తుంది దేవుడమ్మ. కోపంగా ఆదిత్య అరిస్తే.. అదే రేంజ్‌లో దేవుడమ్మ కూడా వార్నింగ్ ఇస్తుంది. అక్కడేమో ఆదిత్య దేవికి ఇచ్చిన వాచ్ మాధవ్ చేతిలో ఉంటుంది. అది తీసుకుని రాధ దగ్గరికి వెళ్లి సతాయిస్తాడు. ‘ఏమో అనుకున్నా కానీ ఇద్దరూ కలిసి రహస్యాన్ని బాగానే చేధించారే’ అంటాడు మాధవ్. అలాగని వదిలిపెట్టేస్తాననుకున్నారా.. ఒక్క అవకాశం మిస్ అయింది మరో అవకాశాన్ని కల్పించుకుంటానని శపథం చేస్తాడు. రాధ కూడా అదే స్థాయిలో బదులిస్తుంది మాధవ్ మాటలకు. ‘నువే పడే కథలన్నింటికి నిన్ను కాపాడుతున్నది ఎవరంటే అది నీ బిడ్డనే. దిమాక్‌ల కెళ్లి నీ బిడ్డ గురించి సోచాయించడం మానేసిన అంటే నీ అంతు చూడడానికి నిమిషం పట్టదు. నవ్వు సారూ.. నవ్వుతూనే ఉండు. ఆ నవ్వే ఏదో ఒక రోజు నువ్వు చచ్చేటట్టు చేస్తుంది’ అని ఓ రేంజ్‌లో వార్నింగ్ ఇస్తుంది రాధ. దానికి ‘రాధ నువ్ నన్ను ఏం చేయలేవ్. ఎందుకంటావా? నీ ప్రాణం దేవి. దేవి నేను చెప్పినట్టు వినేలా చేసుకుంటా. కాబట్టి నీ కల కలలాగే మిగిలిపోతుంది. అవును.. ఆదిత్యనే మీ నాన్న అని చెప్పడానికి ముహుర్తం ఏదో పెట్టుకుని ఉంటావ్ కదా. కానీ నేను ఉండగా అది జరగనివ్వను’ అని ఏమాత్రం జంకకుండా రిప్లై ఇస్తాడు మాధవ్. మాధవ్ మళ్లీ ఏం స్కెచ్ వేస్తున్నాడో తెలుసుకోవాలని ఉందా? అయితే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..