మనుషులలో కంటే జంతువులలో మానవత్వం ఎక్కువగా ఉంటుంది అని కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే అనిపిస్తుంది. జాలి, దయ, కరుణ అనేవి మచ్చుకైన మనలో ప్రస్తుతం కనిపించడం లేదు. ఈ విషయంలో సాటి వారికి సాయం చేయడంలో ఉండే సంతృప్తి, వారు కృతజ్ఞత తెలియజేస్తే కలిగే ఆనందం ఎన్ని కోట్లు ఇచ్చిన వెలకట్టలేనివి. పూర్వ కాలంలో సాయం చేయడంలోని మన గొప్పతనం ఉంటుంది. పుట్టినంధుకు కొన్నేళ్లు అయిన మన పేరు చరిత్రలో చెప్పుకోవాలి అని భావించే వారు చాలా మంది ఉండేవారు. ఈ కారణంగానే వారసత్వంగా వచ్చిన ఆస్తులని దానధర్మాల కోసం ఉపయోగించేవారు.
Compassionate beings ! pic.twitter.com/PFHUyUU8FD
— Animals (@wowamazing__) August 29, 2022
ఇలా సాయం పేరుతో ఆస్తులు కరిగించేయడంతో వారి వారసులు తమ పూర్వీకులని తిట్టుకుంటూ ఉంటారు. అయితే సాయం పొందిన వారు మాత్రం కీర్తిస్తూ ఉంటారు. అయితే ఈ రోజుల్లో కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చేవారు ఎక్కువ అయ్యారు. పిల్లల భవిష్యత్తు కోసం ఆస్తులు కూడబెడుతున్నారు. సాయం అనే విషయాన్ని పూర్తిగా విస్మరించారు. ఏ సందర్భంలో అయిన దానిని ఒక బూతుగా చూసే జనం ఉన్నారు. అయితే జంతువులకి డబ్బు ఆశ ఉండదు. భవిష్యత్తు కోసం భయం ఉండదు. బ్రతికి ఉన్నంత కాలం ఆకలి తీర్చుకొని హాయిగా బ్రతకడం మీదనే వాటి ఆలోచన ఉంటుంది. అందుకే ఆపదలో ఉన్న ఇతర జంతువులని కాపాడటానికి తమ వంతు సాయాన్ని అందిస్తూ ఉంటాయి.
బయట కుక్కలకి, సముద్రంలో డాల్పిన్స్ కి విశ్వాసం ఎక్కువ. తాజాగా ఓ వీడియో ఆ రెండింటి గొప్పతనాన్ని చూపించింది. ట్విట్టర్ ఈ వీడియోని ఏకంగా 40 లక్షల మంది వీక్షించడంతో ఇది కాస్తా వైరల్ గా మారింది. ఓ కుక్క సముద్రంలో చిక్కుకుంది. దానిని ఓ డాల్ఫిన్ తన వీపు మీద ఎక్కించుకొని ఒడ్డుకు చేర్చింది. ఒడ్డుకి చేరిన కుక్క ప్రాణాలు కాపాడిన డాల్ఫిన్ కి తనదైన శైలిలిలో కృతజ్ఞతని తెలియజేసింది. ఆ వీడియో ఎవరో క్లిక్ చేసి ట్విట్టర్ లో షేర్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ గా మారింది