యాంకర్ రష్మీగౌతమ్ నటిగా, యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని దూసుకుపోతుంది. ఇక రష్మీ నటిగా ఎంత బాగా పాపులర్ అయ్యిందో జంతు ప్రేమికురాలిగా కూడా అంతే గుర్తింపు ఉంది. మూగజీవాల మీద ఆమెకి విపరీతమైన ప్రేమ. వాటి సంరక్షణ కోసం తనవంతుగా సహకారం అందిస్తుంది. ఇక కరోనా కష్టకాలంలో అందరూ మనుషులకి సాయం అందించడంపై దృష్టిపెడితే రష్మీగౌతమ్ మాత్రం వీధి కుక్కలు ఆకలితో అలమటిస్తున్నాయి అంటూ వాటికి ఆహారం అందించే ప్రయత్నం చేసింది.
అలా కరోనా సమయంలో మూగజీవాల కోసం ఆమె చేసిన కార్యక్రమాలు బాగా పాపులర్ అయ్యాయి. అలాగే ఎవరైనా మూగజీవాలని హింసించడం వీడియోలలో చూస్తే వెంటనే రియాక్ట్ అవుతుంది. తన ఆవేదనని వెల్లడిస్తుంది. అలాగే తాజాగా వినాయక చవితి రోజు ఓ ఏనుగుతో వినాయకుడికి పూలమాల వేయించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో చూసిన రష్మి దానిపై తన ఆవేదనని వెల్లడిస్తూ ట్విట్ చేసింది. ఆ పూల మాల వేయడానికి ఏనుగు ఎంత ఇబ్బంది పడిందో కదా.
అలా హింసించడం ఎంత వరకు న్యాయం అంటూ కామెంట్ చేసింది. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ మీరు జంతు ప్రేమికురాలు కాదు హిందూ వ్యతిరేకి అంటూ కామెంట్స్ చేశాడు. దీనిపైఆమె ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. నేను నందిని, గోమాత పూజిస్తాను అందుకే పాలు కూడా తాగను. లెదర్ తో చేసిన చెప్పుల్ని కూడా కనీసం వేసుకోను. పాల కోసం గోవు జీవిత కాలంలో గర్భం దాలుస్తుంది. అలాగే మహిళలు ఎదుర్కొనే పీరియడ్స్ సమయంలో చాలా నొప్పిని ఎదుర్కొంటారు. ఇవన్నీ నాకు తెలుసు అంటూ రిప్లై ఇచ్చింది..