హోటల్‌లో కాఫీ తాగడానికి వెళ్లిన మోనిత.. అప్పటికే అక్కడ ఉన్న సౌందర్య, ఆనందరావు, హిమ కంటపడుతుంది. దాంతో ఒక్కసారిగా షాకైన మోనిత.. వారితో ఏదేదో మాట్లాడి కవర్ చేస్తుంది. మరోవైపు దీప మాత్రం కార్తీక్ గురించి వెతుకుతూ ఉంటుంది. అనంతరం ఇంటికి వెళ్లిన మోనితాతో గొడవ పడతాడు కార్తీక్. ఆ తర్వాత ఆగస్టు 30 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
కార్తీక్ బెడ్ మీద పడుకుని ప్రశాంతంగా నిద్రపోతుంటాడు. పక్కనే అటు ఇటు తిరుగుతూ దీప గురించే ఆలోచిస్తుంటుంది దీప. ఇప్పటికైనా ప్రశాంతంగా కార్తీక్‌తో కలిసి బతుకుదామనుకుంటే శనిలా దాపురించిందని దీపని తిట్టుకుంటూ ఉంటుంది. దీప సామాన్యురాలు కాదు. కార్తీక్ గతం గుర్తోచ్చేలా చేయగలదు. అదే జరిగితే ఏమైనా ఉందా అనుకుంటూ గతంలో కార్తీక్ తనను తిట్టడం గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అలాగే.. వేరే వాళ్లకి ఇచ్చిన కొడుకు గురించి తలచుకుని బాధపడుతుంది మోనిత.
మరోవైపు.. సౌందర్య వంట చేసేందుకు కూరగాయలు కట్ చేస్తుంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన ఆనందరావు.. బాధగా ఉన్నావా.. సంతోషంగా ఉన్నావా.. వంట చేస్తున్నావని అడుగుతాడు. దాంతో.. ‘మోనిత ప్రవర్తనలో ఏదో తేడా ఉందండి.. మనల్ని చూసి ఏందుకు కంగారు పడింది. మాములు సమయంలో అయితే మనల్ని చూడగానే ఏడ్చేది కదా. కానీ.. దాన్ని కళ్లలో కన్నీటి చుక్క కూడా రాలేదు. నాకు ఏదో అనుమానంగా ఉంది. దాని మీద ఓ కన్నేసి ఉంచుతా’ అని చెబుతుంది సౌందర్య.
అనంతరం.. కార్తీక్ కారు డ్రైవింగ్ చేస్తుంటాడు. ఇంతలో పక్కనే ఉన్న శివ, మోనితకి కాల్ చేయడానికి ఫోన్ తీస్తాడు. ఎందుకు చేస్తున్నావని శివని తిట్టి కారు దిగమంటాడు.. శివ కుదరదని చెప్పడంతో తనే కారు దిగి శివని తిడుతుంటాడు. ఇంతలో ఆటోలో అటు నుంచే వెళుతున్న దీప కంటపడతంతో.. దిగి ఆర్తంగా పరిగెత్తుకుంటూ వెళుతుంది. ఇంతలోనే కారులో ఎక్కి వెళ్లిపోతాడు కార్తీక్. దాంతో ఆటోలో కార్తీక్‌ని ఫాలో అవుతుంది. కార్తీక్ ఎక్కడు ఉన్నాడో తెలుసుకుని ఇంటికి తీసుకెళ్లాలని అనుకుంటుంది. వెంటనే డాక్టర్‌కి కాల్ చేసి జరిగిన విషయాన్ని చెబుతుంది.
తర్వాతి సీన్‌లో.. ఆటోను తూడుస్తూ అమ్మనాన్న గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో వారణాసీ అక్కడికి వస్తాడు. తాతయ్య వాళ్లు ఎవరైనా పంపారా అని అడుగుతుంది. లేదని అబద్దం చెబుతాడు వారణాసీ. కానీ నిజానికి ఆనందరావు పంపితేనే అక్కడికి వచ్చాడు. అనంతరం తనకోసమే అక్కడికి వచ్చానని ఇకపై తనతోనే ఉంటానని చెబుతాడు. సరేనని చంద్రమ్మ, ఇంద్రుడిని పిలిచి.. తన మామయ్య అని పరిచయం చేస్తుంది. అనంతరం పనుందని అందరూ వెళ్లిపోతారు.
మరోవైపు.. కారులో ఇంటికి వెళ్లిన కార్తీక్ లోపలికి వెళ్లకుండా బయటే నిలుచుని చూస్తుంటాడు. వెళ్లకుండా ఎందుకలా చూస్తున్నారని శివా అడిగితే.. మీ మేడమ్ అంటే భయమని చెబుతాడు కార్తీక్. ఇంతలో దీప కూడా అక్కడికి వస్తుంది. బట్టల దగ్గర ఉన్న అసిస్టెంట్‌తో ఏదో మాట్లాడుతుండగా.. డాక్టర్ బాబు అంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది దీప. అది చూసి.. మీరు వెతుకుతున్న వ్యక్తి తను కాదని చెబుతుంటాడు కార్తీక్. ఇంతలో ఎవరితో మాట్లాడుతున్నావు కార్తీక్ అంటూ మోనిత బయటికి వస్తుంది. అక్కడికి వచ్చిన దీపని చూసి షాక్ అవుతుంది మోనిత. దాంతో కోపంతో ఊగిపోయిన దీప.. చెడా మడా తిట్టేస్తుంది. అది చూసి శివకి చెప్పి బయటికి పంపమని చెబుతుంది మోనిత. దాంతో మోనిత పేరుతో పిలుస్తూ చంపేస్తానని బెదిరిస్తుంది. ఆమెని అలా పేరు పెట్టి మోనిత అని పిలవడం కార్తీక్‌లో సందేహం మొదలవుతుంది. దాంతో.. ‘నిన్ను పేరు పెట్టి మోనిత అని పిలిచిందంటే.. ఆమె నీకు తెలుసా. నువ్వు తెలిస్తే నేను కూడా తెలిసే అవకాశం కూడా ఉంటుంది కదా. అస్సలు విషయం ఎంటో చెప్పు’ అంటూ మోనితని కార్తీక్ నిలదీస్తాడు. డబ్బుకోసం అలా నాటకాలాడుతుందని కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది మోనిత. దాంతో.. భర్త కోసం, మంగళ్యం కోసం వచ్చానని విసురుగా అంటుంది దీప. దాంతో ఈ ఎపిసోడ్‌కి శుభం కార్డు పడింది. తరువాయి భాగంలో.. కార్తీక్ నా వాడంటే.. నా వాడంటూ మోనిత, దీప మధ్య మాటల యుద్ధం జరుగుతుంటుంది. కారు ప్రమాదంతో డాక్టర్ బాబు శకం ముగిసిందని.. ఇప్పుడు ఉన్నది కార్తీక్ అని పొగరుగా అంటుంది మోనిత. దాంతో త్వరలోనే కార్తీక్ తనని గుర్తు పడతాడని.. అప్పటి వరకూ జాగ్రత్తగా చూసుకోమంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది దీప. అసలేం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.