సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత ఇప్పటికి తన హవాని ఏ మాత్రం తగ్గకుండా కొనసాగిస్తుంది. విడాకుల తర్వాత సమంత మీడియాకి ఎక్కువగా దూరంగా ఉంటూ వస్తుంది. ఆ మధ్య కరణ్ జోహార్ షోలో చివరిగా సమంత పార్టిసిపేట్ చేసింది. తరువాత మీడియాలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా కనిపించడం లేదు. కనీసం ఓ చిన్న అప్డేట్ కూడా ఆమె నుంచి లేకపోవడంతో రకరకాల కథనాలు వినిపించాయి. సోషల్ మీడియాలో అక్కినేని ఫ్యాన్స్ ట్రోలింగ్ కారణంగానే ఆమె దూరంగా ఉందనే కథనాలు వ్యాపించాయి. ఇక ఆమె సౌత్ నుంచి యశోద, శాకుంతలం అనే రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తుంది.
ఈ రెండు కూడా ఫీమేల్ సెంట్రిక్ సినిమాలే కావడం విశేషం. ఇక ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ తో బాలీవుడ్ ని సైతం ఈ అమ్మడు ఆకర్షించింది. దీంతో బాలీవుడ్ లో ఆమెకి పవర్ ఫుల్ పాత్రలు ఆఫర్ చేస్తూ దర్శక, నిర్మాతలు ముందుకొస్తున్నారు. ఈ నేపధ్యంలో సౌత్ నుంచి బాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యే పనిలో సమంత ఉంది. ఇదిలా ఉంటే ఆమె సోషల్ మీడియాకి దూరంగా ఉండటానికి కారణం ట్రోల్స్ కాదని బిటౌన్ లో వినిపిస్తుంది. సమంత రుస్సో బ్రదర్స్ నిర్మించే వెబ్ సిరీస్ సీటాబెల్ లో ఆమె నటిస్తుంది. ఇందులో ఆమె పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతుంది. దీనికోసం మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం ఉండాలి.
ఈ నేపధ్యంలో పాత్ర పెర్ఫెక్షన్ కోసం ఆమె మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే పనిలో ఉందని, ఆమె దృష్టి మొత్తం ఇప్పుడు దానిపైనే ఉందని, ఈ కారణంగానే సోషల్ మీడియాని పూర్తిగా పక్కన పెట్టిందని తెలుస్తుంది. ఇక మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యే వరకు ఆమె మీడియాకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు బిటౌన్ లో వినిపిస్తున్న మాట. ఇక సమంతకి బాలీవుడ్ లో కొంత మంది పేరున్న వ్యక్తులు సపోర్ట్ ఉందని, ఈ నేపధ్యంలో అక్కడ జెండా పాతడానికి అమ్మడు రెడీ అయ్యి హిందీ ప్రాజెక్ట్స్ పై ఎక్కువ దృస్తి పెట్టినట్లు బోగట్టా.