Balakrishna : నందమూరి బాలకృష్ణతో పాటు ఏపీ, తెలంగాణ ప్రబుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బాలయ్య నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి, రుద్రమదేవి చిత్రాలు పన్ను రాయితీ తీసుకుని టికెట్ రేటు తగ్గించలేదని సుప్రీం కోర్టులో సినీ ప్రేక్షకుల వినియోగదారులు సంఘం పిటిషన్ దాఖలు చేసింది. పన్ను రాయితీ ప్రయోజనాలను సినీ ప్రేక్షకులకు బదలాయంచలేదని ఆరోపించింది. ఈ చిత్రాలు పన్ను రాయితీ పొందిన డబ్బును తిరిగి ప్రభుత్వం రికవరీ చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసం విచారణ చేపట్టింది.
ఈ మేరకు నందమూరి బాలకృష్ణతో పాటు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు సహా ప్రతివాదులందరికీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్ర చూడ్ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ మూవీ బాలకృష్ణ కెరీర్‌లో వందో సినిమాగా తెరకెక్కింది. శాతకర్ణి జీవితం గురించి చెబుతూ తీసిన ఈ మూవీ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. హేమమాలిని, శ్రియ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా కథను డైరెక్టర్ క్రిష్ ఎంతో అందంగా తెరపై చూపించారు.
Balakrishna : రుద్రమదేవి జీవితం ఆధారంగా ‘రుద్రమదేవి’ తెరకెక్కింది..
2017 జనవరిలో బాక్సాఫీసు ముందుకు వచ్చిన ఈ మూవీకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలు పన్ను రాయితీ ఇచ్చాయి. ఈ విషయంపై సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇక రుద్రమదేవి విషయానికి వస్తే.. అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని గుణశేఖర్ రూపొందించారు. కాకతీయ వీరనారి రుద్రమదేవి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. కృష్ణంరాజు, అల్లు అర్జున్, రానా, ప్రకాష్ రాజ్.. ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. 2015లో విడుదలైన ఈ చిత్రానికి కూడా తెలంగాణ ప్రభుత్వం పన్ను రాయితీ ఇచ్చింది. అయితే ఏపీ ప్రభుత్వం ఈ సినిమాకు పన్ను రాయితీ ఇవ్వలేదు.